Site icon Prime9

Telangana Medical colleges: తెలంగాణలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

Telangana Medical colleges

Telangana Medical colleges

Telangana Medical colleges: ప్రస్తుతమున్న వైద్య కళాశాలలకి తోడు తెలంగాణలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు రానున్నాయి. ప్రతి జిల్లాకి ఓ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 9 ఏళ్ళల్లో 29 కొత్త మెడికల్ కళాశాలలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఫలితంగా రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్లు పదివేలకి చేరువయ్యాయి.

కొత్త కాలేజీలు ఎక్కడంటే..(Telangana Medical colleges)

కొత్తగా జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు స్థానికంగా ఉంటూనే ఎంబిబిఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి. మారుమూల ప్రాంతాలకి సైతం సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువయ్యాయి. సిఎం కెసిఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విప్లవమిదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

మరోవైపు వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేశారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం మెడికల్‌ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం సీట్లు అన్ రిజర్వుడుగా ఉండేవి. ఆ సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ ఎంబీబీఎస్‌ సీట్లు పొందేవారు. తాజా సవరణ వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి.

Exit mobile version