Site icon Prime9

Salt: పెరుగు, సలాడ్స్ లో ఎక్కువ ఉప్పు వేస్తున్నారా?.. అలా అస్సలు చేయకండి!

salt

salt

Salt: ఉప్పు మన దినచర్యలో ఒక భాగం. కొందరు వంటల్లో ఉప్పు ఎక్కువగా తింటుంటారు. మరికొందరు మితంగా వాడుతుంటారు. అయితే మనం ఉపయోగించే పెరుగు, సలాడ్స్ లో రుచికోసం మోతాదుకు మించి దీనిని వాడుతుంటాం. కానీ అది మంచి పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిలో ఉప్పు ఎంత తక్కువ వాడితే అంత మంచిది అని సలహాలు ఇస్తున్నారు.

ఉప్పు ఎక్కువ వాడితే భారీ నష్టమే! (Salt)

ఉప్పు మన దినచర్యలో ఒక భాగం. కొందరు వంటల్లో ఉప్పు ఎక్కువగా తింటుంటారు. మరికొందరు మితంగా వాడుతుంటారు.

అయితే మనం ఉపయోగించే పెరుగు, సలాడ్స్ లో రుచికోసం మోతాదుకు మించి దీనిని వాడుతుంటాం.

కానీ అది మంచి పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిలో ఉప్పు ఎంత తక్కువ వాడితే అంత మంచిది అని సలహాలు ఇస్తున్నారు.

పెరుగు, సలాడ్స్ లో ఉప్పు తినేవారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆహారాల రుచిని పెంచడానికి ఉప్పు ఎక్కువ కలిపితే మీరు డేంజర్ లో పడినట్టే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరలో అన్నేసి చూడు..నన్నేసి చూడు అనే ఉప్పు సామెత అక్షరాల సత్యం. ఎందుకంటే కూరలో సరైన మోతాదులో ఉప్పు లేకపోతే ముద్ద దిగదు.

కనీస మోతాదులో ఉప్పు ఉంటేనే కూర కూడా రుచిగా అనిపిస్తుంది. ప్రతి వంటకంలో ఉప్పు తప్పనిసరి అవడం వల్ల మనకు తెలియకుండానే అధిక మొత్తంలో తినేస్తున్నాం.

ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నాం.

ఈ వేసవి కాలంలో అధికంగా పెరుగు.. సలాడ్స్ వంటి వాటిని ఎక్కువ మంది తీసుకుంటారు. కానీ అందులో అధిక మోతాదులో ఉప్పు వాడకూడదు.

దీనిపై తాజా పరిశోధనలు పలు సూచనలు చేస్తున్నాయి. సలాడ్‌లు లేదా పెరుగులో వైట్ క్రిస్టల్ సాల్ట్‌ను జోడించడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి.

దీనివల్ల అధిక రక్తపోటు, చెమటలు పట్టడం, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వైట్ క్రిస్టల్ సాల్ట్‌ను ఎక్కువ ఆహారంలో తీసుకోవడం వల్ల.. శరీరంలో కాల్షియం తగ్గిపోయి ఎముకలు బలహీనపడతాయి.

అదే సమయంలో, ఇది జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది. అలాగే జీర్ణక్రియను ఇది నెమ్మదిస్తుంది.

అలాగే ప్రతీరోజు పెరుగులో ఉప్పు కలపడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

దీని బట్టి రోజుకు ఒకటి కంటే ఎక్కువ టీస్పూన్ ఉప్పు తింటే.. మీరు నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు.
ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. ఆహారంలో అదనపు చిటికెడు ఉప్పు వ్యాధిని ఎలా ఆహ్వానిస్తుందో తెలుసుకోండి.

ప్రతి వ్యక్తి కూడా 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది.

మీరు సలాడ్, చాట్ లేదా రైతాలో రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ జోడించవచ్చు. ఈ రెండు లవణాలు సోడియం పెరగకుండా నిరోధిస్తాయి.

అంతేకాకుండా ఆహారానికి రుచిని కూడా అందిస్తాయి. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అసిడిటీ, అజీర్ణం మరియు గ్యాస్ ఏర్పడదు.
మితిమీరిన ఉప్పు తీసుకోవడం అన్ని వయసుల వారిని.. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎక్కువ ఉప్పు తినకండి.

అదేవిధంగా.. సలాడ్ లేదా పెరుగులో ఉప్పు కలపడం మానుకోండి.

Exit mobile version