Bitter gourd: కాకరకాయ పేరు వినగానే ముందు మనకి చేదు గుర్తు వస్తుంది. అంత చేదుగా ఉండటం వల్ల దీన్ని ఎవరు తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు ఐతే కాకరకాయ కూర అంటే ఆమడ దూరం పరిగెడతారు. కాకరకాయను సరయిన రీతిలో వండితే వండితే దీనికన్నా రుచికరమైన కూర ఇంకోటి ఉండదు. కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కాకరకాయను మన ఆహారంలో రోజు తీసుకున్నా మన ఆరోగ్యానికి మంచిది. చేదుగా ఉన్నప్పుడు తినడానికి కష్టంగా ఉంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.
బెల్లం
కాకరకాయలో ఉన్న చేదును బెల్లం వేయడం వల్ల కొంచం తగ్గుతుంది. కాకరకాయ పులుసు చేస్తున్న సమయంలో ఉడికేప్పుడు కొంచెం బెల్లం ముక్క వేస్తే తగ్గి కూర రుచిగా ఉంటుంది.
నిమ్మకాయ
నిమ్మకాయలోని పులుపు కాకర చేదును తగ్గించడానికి మనకి బాగా సహాయపడుతుంది. మీరు కాకరకాయ కూర తయారు చేస్తున్న సమయంలో కూర ఉడికిన తర్వాత చివరిలో నిమ్మరసాన్ని వేయండి. ఇలా చేయడం వల్ల కాకరకాయ చేదు తగ్గి, కూర మరింత రుచిగా ఉంటుంది.
ఉప్పు
ఉప్పుతో కాకరకాయ చేదును మొత్తం తగ్గించవచ్చు. కాకరకాయ ముక్కల్లో రాత్రంతా ఉప్పు వేసి ఉంచండి. అలాగే కూర వండే ముందు, కాకరకాయ ముక్కలను బాగా పిండండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు చాలా వరకు తగ్గుతుంది.