Site icon Prime9

Ys Sharmila : వైఎస్ షర్మిల అరెస్ట్, హైదరాబాద్ కి తరలింపు.. కారణం అదేనా?

ys sharmila arrested due to shocking comments on brs mla

ys sharmila arrested due to shocking comments on brs mla

Ys Sharmila : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు రోజు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో దీనికి నిరసనగా మరుసటి రోజు ప్రగతి భవన్ వద్ద దీక్ష చేపట్టేందుకు షర్మిల కారులో బయల్దేరి వెళ్లారు. ఆ తరుణంలోనే షర్మిల అరెస్ట్ అయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. స్థానిక ఎమ్మెల్యేపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఆమె బస చేసిన ప్రాంతం వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు భావించిన పోలీసులు.. షర్మిల పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. ఈ మేరకు పోలీసులు షర్మిలకు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆమెను అరెస్టు చేసిన మహబూబాబాద్ పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

వైఎస్ షర్మిలను (Ys Sharmila) అరెస్ట్ చేయడానికి కారణం అదేనా..?

షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ షర్మిల పాదయాత్రపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే విమర్శలకు శనివారం మహబూబాబాద్ పట్టణంలో మాట, ముచ్చట కార్యక్రమంలో షర్మిల ఘాటుగా స్పందించింది. దీంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

కాగా ఆదివారం ఉదయం షర్మిల బస చేసిన మహబూబాబాద్ మండలం బేతోలు శివారు సోలార్ తాండా వద్ద భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు, బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిల ప్లెక్సీలను చింపివేశారు. దీంతో బీఆర్ఎస్, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శంకర్ నాయక్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ – కురవి జాతీయ రహదారిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఘర్షణలు తలెత్తకుండా భారీ సంఖ్యలో పోలీసులు షర్మిల బసచేసే ప్రాంతం వద్దకు చేరుకున్నారు.

YS Sharmila

పరుష పదజాలంతో విమర్శలు చేయడంతో పాటు.. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్నక్రమంలో షర్మిల పాదయాత్రకు అనుమతిని పోలీసులు రద్దు చేశారు. షర్మిలను తన కారవాన్‌లోకి వెళ్లి అరెస్టు చేశారు. పోలీస్ వాహనంలో ఎక్కించి.. షర్మిలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం వల్లనే అనుమతి రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు షర్మిలకు పోలీసులు నోటీసులు సైతం అందజేసినట్లు వెల్లడించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version