Site icon Prime9

Gujarath: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

father committed suicide along with his son in ntr dist

father committed suicide along with his son in ntr dist

Gujarath: దేవీనవరాత్రుల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తూ ఆ ప్రాంతవాసులు జగన్మాతను ఆరాధిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఓ యువకుడు డాన్స్ చేస్తూ గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయాడు. దీనితో శరన్నవరాత్రి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రజలు పూజిస్తుంటారు. కాగా ఎనిమిదో రోజైన దుర్గాష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. అయితే ఈ నవరాత్రి వేడుకల్లో జగన్మాతను భక్తులు తమ తమ ప్రాంత సంప్రదాయాలను అనుసరించి ఆరాధిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లోని ఓ ప్రాంతంలో నవరాత్రి వేళ అమ్మవారిని దాండియా నృత్యం చేస్తూ ఆరాధిస్తున్నారు. ఎంతో సంతోషంగా సంప్రదాయ పద్ధతిలో యువతీ యువకులు నృత్యం చేస్తూ అమ్మవారి సేవలో తరిస్తున్నారు. కాగా అంతలోనే ఆ ప్రాంతం అంతా తీరని విషాదం నెలకొంది.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో నృత్యం చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంత వరకూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న అతడు అలా అచేతనంగా పడిపోవడం చూసి వెంటనే అక్కడే ఉన్న స్థానికులు అతనిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన చూసినవారందరినీ కలచివేసింది. ఎంతో సందడిగా ఉండాల్సి ఆ దేవీ మండపం అంతా ఒక్కసారిగా నిశ్శబ్ధంతో నిండిపోయింది.

ఇదీ చదవండి: చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్.. నెల్లూరులో ఆచూకి..!

Exit mobile version