Site icon Prime9

MLA Brahmanaidu: నల్లుల్లా నలిపేస్తాను.. టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

Andhra Pradesh: పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నేతలను నల్లుల్లా నలిపేస్తానని హెచ్చరించారు. వినుకొండలో గురువారం వాణిజ్య సముదాయం భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి జిల్లా అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై విరుచుకుపడ్డారు. తాను అభివృద్ధి చేస్తుంటే ఆంజనేయులు కోర్టులో కేసులు వేసి ఆపుతున్నారని ఆరోపించారు. జీవీకి సహకరించే కొన్ని నల్లులు ఉన్నాయని, వాళ్లను నలిపేస్తామని హెచ్చరించారు.

కాగా, గతంలో కూడా బొల్లా బ్రహ్మనాయుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేల్పూరులో తానే నాయకుడిని, తన కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు. ఓ టీవీ చానెల్ ప్రతినిధిని అందరి ముందు తిడుతున్న మీడియాతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో బ్రహ్మనాయుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

రైతులనుంచి కొన్న ధాన్యానికి డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించినందుకు ఒక రైతును చెప్పుతీసి కొడతానంటూ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మండిపడ్డారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయల సమక్షంలోనే ఆయన ఈ విధంగా ప్రవర్తించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version