Site icon Prime9

AP Captial: 3 రాజధానుల్లో స్పష్టత ఎక్కడా? ప్రశ్నించిన అమరావతి జేఏసి

Where is the clarity in the 3 capitals-Amaravati JAC questioned

Where is the clarity in the 3 capitals-Amaravati JAC questioned

Amaravathi JAC: రాష్ట్రంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను అడ్డుకొంటామని వైకాపా శ్రేణులు, మంత్రులు పదే పదే చెబుతున్న దానిపై అమరావతి జేఏసీ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మూడు రాజధానుల పేరుతో పేర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ది అని చెప్పే నిర్ధిష్ట పరిస్ధితి వారి వద్ద లేదన్నారు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఏ రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ వస్తాయో చెప్పలేదు, వేల పడకల వైద్యశాలు వస్తాయి అని చెప్పే పరిస్ధితి ఎప్పుడూ పేర్కొనకుండా ఎలా మూడు రాజధానుల నిర్ణయం అంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు వస్తాయో చెప్పాలన్నారు. మూడు రాజధానుల ఏర్పడితే ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉండబోతుందో చెప్పకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

గడిచిన వెయ్యి రోజులకు పైగా ఒకే రాజధాని కోసం మేము ఉద్యమం చేస్తున్నామన్నారు. శాంతియుతంగా జరుపుతున్న మా ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా వైకాపా ప్రభుత్వం ప్రయత్నించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దీక్షా శిభిరాల వద్ద వ్యతిరేక ఫ్లెక్సీలు, పాదయాత్ర చేపట్టే ప్రాంతాల్లో మూడు రాజధానుల పేరుతో భయానక వాతావరణం చేపట్టడం వారికే చెల్లిందన్నారు. పిచ్చి పిచ్చి మాటలు తప్ప, వైకాపా శ్రేణుల వద్ద వాస్తవ సమాచారం లేదన్నారు.

మూడు రాజధానుల పేరుతో మేము కూడ పాదయాత్ర చేస్తామని పేర్కొంటున్న వైకాపా వారికి ఓ ఉచిత సలహా కూడా అమరావతి జేఏసి ఇచ్చింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పేర్కొన్నట్లుగా మూడు రాజధానుల కూడా 30వేల ఎకరాల లెక్కన ఇచ్చే అంశాన్ని కూడా వారు చేపట్టబోయే పాదయాత్రలో పేర్కొనాలని విజ్నప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్ర చేసే హక్కు ఉంటుందన్నారు. అంతేగాని ఒళ్లు బలిసిన యాత్రగా పేర్కొనడం కరెక్ట్ కాదన్నారు. మీరు చేపట్టిన బస్సు యాత్రలాగా కాకుండా చూసుకోవాలని వైకాపా వర్గాలకు జేఏసి హితవు పలికింది. అమరావతి పాదయాత్రపై అవాకులు చవాకులు పేలవద్దని మంత్రులకు మరొక్కసారి విన్నవించుకొంటున్నామని జేఏసి నేతలు పేర్కొన్నారు.

ప్రజల్ని ప్రాంతాల వారీగా విభజించడమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ పెద్దలకు, సీఎంకు, మంత్రులకు, 45మంది సలహాదారులకు నిర్ధిష్టమైన ప్రణాళిక లేదన్నారు. వారికి తెలుసు కాబట్టే మూడు రాజధానుల పేరుతో కాలయాపం చేస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్రలో రైతులు లేరని పదే పదే వైకాపా శ్రేణులు మాట్లడడుతూ కళ్లు లేని దృతరాష్ట్రుల్లా ప్రవర్తిస్తున్నారు. పాదయాత్ర వీడియోలు వాళ్లకు చూపించండి అంటూ మీడియాను అభ్యర్ధించారు. ఇదంతా తెలుగుదేశం చేస్తున్న కుట్రగా చెప్పడం కరెక్ట్ కాదన్నారు. తిరుపతిలో చేపట్టిన రైతుల సభలో భాజపా నేత అమిత్ షా పాల్గొనలేదా అని గుర్తుంచుకోండి అంటూ హేళన చేశారు. జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని వర్గాలలతోపాటు వైకాపా శ్రేణుల్లో కొంతమంది లోపాయికారిగా మాకు అండగా నిలబడి కూడా ఉన్నారని చెప్పారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలు మావే నని చెప్పుకొంటున్న సీఎం జగన్ రైతుల పాదయాత్రతో ఉలిక్కిపడ్డారన్నారు. యధా రాజ తధా ప్రజా అంటూ సీఎం పేర్కొన్న అనంతరం మంత్రులు, కీలక నేతలతో రైతులు చేపట్టిన పాదయాత్రపై అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. అమరావతి రాజధానిగా మేమే చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. 29వేల మంది కుటుంబాలు అమరావతి రాజధానికి భూములు ఇచ్చాయన్నారు. అయితే అవన్నీ యావత్తు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి మాత్రమేనని చెప్పుకొచ్చారు. మీ పీఠం కదులుతుందన్న కారణంగా పాదయాత్రపై ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి:Chengalamma Temple: చెంగాళమ్మ సన్నిధిలో పురపాలక రీజనల్ డైరెక్టర్

Exit mobile version