Site icon Prime9

Viral News: క్యాంటీన్లో ఇద్దరు అమ్మాయిల ఫైట్.. చూస్తూ ఎంజాయ్ చేసిన సహవిద్యార్థులు..!

girl students fight in collage canteen

girl students fight in collage canteen

Viral News: ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే చుట్టుపక్కల ఉన్న వారు వెళ్లి వారిని విడదీసి సర్దిచెప్తుంటారు. మరి కొన్నిసందర్భాల్లో ఎవరు కొట్టుకుంటే మాకెందుకు అన్నట్టు, ఎదుటివారు కొట్టుకుంటుంటే ఎంచక్కా చూస్తూ ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటారు. అయితే అచ్చం ఇలానే జరిగిన సంఘటన ఒకటి బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. సిల్లీ రీజన్తో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే చుట్టూ ఉన్న తోటి విద్యార్థులు కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ వారిరువురు కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వక మానరు.

బెంగళూరులోని దయానంద సాగర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు అమ్మాయిల మధ్య చిన్న తగాదా జరిగింది. చుట్టుపక్కల ఉన్న తోటివిద్యార్థులు దీనిలో జోక్యం చేసుకుని వారిని విడిపించకపోవడం వల్ల ఈ స్వల్ప తగదా కాస్త పెద్ద వివాదంగా మారింది. వెయింగ్ మిషన్ పై బరువు చూసుకునే విషయంలో మొదలైన వాగ్వాదం కాస్త చివరికి వారిరువురు కొట్టుకునే వరకు వెళ్లింది.

ఇకపోతే వీడియోలోని ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం తీవ్రంగా తగాదా పడడం జరిగింది. అయితే అక్కడే క్యాంటిన్ లో ఉన్న మిగిలిన విద్యార్థులు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వారిద్దరి మధ్య గొడవను ఎంజాయ్ చేస్తూ వీడియోలో కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇదీ చదవండి: టీచర్కు పెళ్లి అవుతుందని.. విద్యార్థి ఆత్మహత్య

Exit mobile version