Site icon Prime9

Gangs Of Godavari : విశ్వక్ సేన్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. “గ్యాంగ్స్ అఫ్ గోదావరి” !

viswak sen new movie titled as gangs of godavari

viswak sen new movie titled as gangs of godavari

Gangs Of Godavari : యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత హిట్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం.. లేటెస్ట్ గా వచ్చిన  “దాస్ కా దమ్కీ” సినిమాలతో సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ హీరో.. ప్రస్తుతం గామి, VS10, VS11 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే గామి షూటింగ్ పూర్తి చేసిన విశ్వక్.. మిగిలిన రెండు సినిమాలను శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కాగా VS11 సినిమాని చల్ మోహన్ రంగ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో రాబోతుంది. ఇక ఈ సినిమాలో  తెలుగు బ్యూటీ అంజలి హీరోయిన్ గా నటిస్తుండగా..  తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో విశ్వక్ (Viswak Sen) సరికొత్త లుక్ లో కనిపించబోతుండడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

 

 

ఇక ఈ సినిమాకు “గ్యాంగ్స్ అఫ్ గోదావరి” ( Gangs Of Godavari ) అనే టైటిల్ ఖరారు చేశారు. గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుననట్లు అనిపిస్తుంది. గ్లింప్స్ లో.. మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ మాస్ డైలాగ్ తో మొదలుపెట్టాడు. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

Exit mobile version