Site icon Prime9

Mahesh Babu : మహేష్ బాబుతో మూవీ ఎలా ఉంటుందో చెప్పిన విజయేంద్ర ప్రసాద్… బాక్సాఫీస్ షేక్

vijayendra prasad shocking comments on mahesh movie with raajamouli

vijayendra prasad shocking comments on mahesh movie with raajamouli

Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి గురించి అందరికి తెలిసిందే. సీరియల్ ని డైరెక్ట్ చేయడం దగ్గరి నుంచి ప్రపంచ స్థాయిలో అవార్డులను సైతం గెలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. బాహుబలితో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి… ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న జక్కన్న తన నెక్స్ట్ ఫిల్మ్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉండగా… గతంలో ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న జక్కన్న మహేష్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాలన్నింటి కంటే ఈ మూవీ మరింత హై లెవల్లో ఉండనుందని… గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో రాబోతుందని చెప్పడంతో మూవీపై మరింత హైప్ ఏర్పడింది. అలానే పలు ఇంటర్వ్యూ లలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండనుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

ఇక తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. విజయేంద్రప్రసాద్. ఈ సినిమా నిజ జీవిత సంఘటన నుంచి ప్రేరణ పొందిన కథ అని అన్నారు. అదే విధంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ఇది అడ్వెంచర్ స్టోరి. వచ్చే ఏడాదిలో మూవీ ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాను ఫ్రాంచైజీగా డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సీక్వెల్స్ వస్తాయా అని ఓ యాంకర్ అడగ్గా.. ఆయన స్పందిస్తూ.. “సీక్వెల్స్ కచ్చితంగా వస్తాయి. ఈ సీక్వెల్స్ కథ మారుతున్నప్పటికీ ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయి. మొదటి భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తిచేసే పనిలో ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా తీయాలని అనుకుంటున్నారని… కానీ ఇప్పటివరకు తనకు అలాంటి అవకాశం రాలేదని చెప్పారు. ఇప్పుడు ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమాకు మహేష్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది లోనే మహేష్… అన్నయ్య, తల్లి , తండ్రి మృతి చెందిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాగా విషాదంలో ఉన్నట్లు సమాచారం అందుతుంది.

Exit mobile version