Vijaya Shanti: నేను వెళ్లలేదు.. కావాలనే పార్టీ నుంచి గెంటేశారు- విజయశాంతి

Vijaya Shanti: రాష్ట్రం ఏర్పాడ్డాక.. కేసీఆర్ తెలంగాణను పూర్తిగా దోచుకున్నారని విజయశాంతి ఆరోపించారు. రాజకీయల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు ఇతర భాజపా నేతలు హజరయ్యారు.

Vijaya Shanti: రాష్ట్రం ఏర్పాడ్డాక.. కేసీఆర్ తెలంగాణను పూర్తిగా దోచుకున్నారని విజయశాంతి ఆరోపించారు. రాజకీయల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు ఇతర భాజపా నేతలు హజరయ్యారు.

25 ఏళ్ల రాజకీయ వసంతాల కార్యక్రమంలో భాజపా కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో గెలుపోటములు చూశానని విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ లో తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసి పెద్ద తప్పుజరిగిందని.. కేసీఆర్ లాంటి నియంతను తానేప్పుడు చూడలేదని విజయశాంతి అన్నారు.

తెరాసలో ఉంటున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు వివరించారు.

తెలంగాణ వస్తుందనే దశలో కేసీఆర్ తనపై కుట్ర చేశారని.. తన పేరు వినపడకుండా ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రకటన వస్తుందని తెలిసే.. కేసీఆర్ ఒక్క రోజు మందు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన చెందారు.

పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికి అర్ధం కాలేదని.. దానికి కారణం కూడా చెప్పలేదన్నారు.

ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి చూస్తే బాధగా ఉందని.. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందని విమర్శించారు.

తెలంగాణ పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల మేలు కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు.

చిన్నతనం నుంచే తెలంగాణకు ఏదో చెయ్యాలనే ఆకాంక్ష ఉండేదని.. ఆ తపనతోనే పార్టీ పెట్టినట్లు తెలిపారు. కేసీఆర్ మోసాలు తెలియక పార్టీని విలీనం చేశానన్నారు.

పదవులు ముఖ్యం కాదని.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే భాజపా (Bjp)  లో చేరినట్లు పేర్కొన్నారు.

1998 జనవరి 26న విశయశాంతి  భాజపా లో చేరారు.
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు.

2009 లో ఆ పార్టీని తెరాసలో విలీనం చేశారు.

2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు.

2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. 2020లో తిరిగి బీజేపీ గూటికే చేరారు.

రాజకీయాల్లో ప్రసంశల కంటే విమర్శలే ఎక్కువగా ఉంటాయని బండి సంజయ్ అన్నారు. ఓ మహిళ 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండటం గొప్ప విషయమని బండి సంజయ్ అన్నారు. విజయశాంతికి బీజేపీ నే చివరి మజిలీ కావాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/