Site icon Prime9

Varun Tej: నేను ‘మట్కా’ చేయడానికి అదే కారణం – వరుణ్‌ తేజ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Varun Tej Interesting Comments on Matka Movie: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ ‘మట్కా’. ఈ మధ్య వరుణ్‌ తేజ్‌ వరుస ప్లాప్స్‌ చూస్తున్నాడు. చివరిగా ఆపరేషన్‌ వాలంటైన్‌తో డిజాస్టర్‌ చూసిన వరుణ్‌ ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టేందుకు మాట్కాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటించారు. నవంబర్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌ తేజ్‌ మీడియాతో ముచ్చటిస్తూ మూవీ విశేషాలను పంచుకున్నాడు. అవేంటో చూద్దాం!

మాట్కా కథను ఎంచుకోవడానికి కారణం!

మట్కా కథ అసలు నా దగ్గరి వస్తుందని అసలు ఊహించలేదు. కొన్నాళ్లగా నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర కోసం ఎదురుచూస్తున్నా. అదే సమయంలో మాట్కా కథ నా దగ్గరకు వచ్చింది. నటులకు కోరుకున్న కథ, పాత్ర దొరకడాన్ని మించిన అదృష్టం మరొకటి ఉండదేమో. నాకు అది మట్కా రూపంలో వచ్చింది. ఈ కథను ఎంచుకోవడానికి ముఖ్య కారణం బలమైన రచనతో తీర్చిదిద్దిన వాసు పాత్ర . ఈ సినిమా 1950-60ల మధ్య సాగుతుంది. బర్మ నుంచి శరణార్థిగా వాసు వైజాగ్‌ వస్తాడు. 1958 నుంచి 82 వరకు తను అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తారు.

మట్కాలో సామాజిక అంశాలేమైన ఉన్నాయా?

సమాజంలోని అంతరాలను ఒక పాత్రతోనే చూపించే ప్రయత్నం చేశాం. వాసుకి సమాజం తనకు ఎలాంటి సాయం చేయడం లేదని కోపం, బాధ ఉంటుంది. ఈ క్రమంలో డబ్బులు సంపాదించుకునేందుకు అతడు ఎంచుకునే మార్గంలో బలమైన వాణిజ్యాంశాలతో కథని నడిపించిన చిత్రమిది.

సినిమాలో వైవిధ్యం ఏంటి?

ఇప్పటి వరకు వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ సినిమాల్లో హత్యలు, దోపిడీలే ఎక్కువ ఉంటాయి. కానీ ‘మాట్కా’ ఓ ఆటను కనిపెట్టిన గ్యాంగ్‌స్టర్‌ కథ. గ్యాంగ్‌స్టర్‌ చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. బర్మా నుంచి వలస వచ్చిన వాసు అంచలంచేలుగా ఎలా ఎదిగాడనేదే ఈ మట్కా. మట్కా జూదం కోసం సెల్‌ఫోన్లు లేని రోజుల్లోనే దేశం మొత్తం ఒకే రోఉ ఒకే నెంబర్‌ని ఎలా పంపించేవారో ఎవ్వరికీ తెలియదు. దీనిపై రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. వాసునే మాట్కా కింగ్‌ అనుకుంటే అతడు ఆ నెంబర్‌ దేశం మొత్తం ఎలా పంపిస్తాడో డైరెక్టర్‌ ఊహించి వాసు పాత్రని డిజైన్‌ చేశారు.

వాసు పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్‌ చేశారు?

ప్రత్యేకంగా హొంవర్క్‌ ఏం చేయలేదు. కానీ డైరెక్టర్‌తో ఎక్కువ టైం స్పెండ్‌ చేశాను. చాలా కథలు చదివాను. అవి వాసు పాత్రలో నన్ను లీనమయ్యేలా చేసేందుకు బాగా ఉపయోగపడ్డాయి. స్క్రిప్ట్స్‌ చదువుతున్నప్పుడే వాసు క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో ఒక అంచనకి వస్తాం. అందులో పాత్ర గురించి చదువుతుండగానే ఓ స్ట్రచర్‌ బిల్డ్‌ అవుతుంది. అందులో అతడు ఎలా కూర్చుంటాడు? ఎలా సిగరేట్‌ కాలుస్తాడు? అనేది ఓ అంచన వేయగలం. ఉత్తరాంధ్ర యాస విషయానికి వస్తే.. వాసు బర్మా నుంచి వస్తాడు కాబట్టి వెంటనే ఆ యాస మాట్లాడాల్సిన అవసరం రాదు. ఆ క్యారెక్టర్‌ ముందుకు వెళుతున్న కొద్ది అక్కడ యాస అలవాటు అవుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ దాదాపు రామోజీ ఫిలిం సిటీలో చేశాం. ఈ సినిమా కోసం అక్కడ.. విశాఖలోని పూర్ణ మార్కెట్‌ సహా చాలా ప్రాంతాల్ని రీక్రియేట్‌ చేసి షూటింగ్‌ చేశామని చెప్పాడు.

Exit mobile version