Vande Bharat Express: సికింద్రాబాద్-వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలు టైమింగ్స్, టికెట్ ధరలు ఇవీ..

Vande Bharat Express: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి రానుంది. ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు ఉంటాయి. ఆదివారం పూర్తిగా సెలవు.

సంక్రాంతి రోజున ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. ఈ నెల16 నుంచి ఈ రైలు రెగ్యులర్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

చార్జీలిలా ఉన్నాయి

సికింద్రాబాద్ నుంచి వైజాగ్ ( ట్రైన్ నెంబర్ 20833)

సికింద్రాబాద్ నుంచి వైజాగ్ -1665 ( ఏసీ చైర్ కార్), 3120 ( ఎగ్జిక్యూటివ్ క్లాస్ ),  రాజమండ్రి – 1365 ( ఏసీ చైర్ కార్), 2485 ( ఎగ్జిక్యూటివ్ క్లాస్ ),

విజయవాడ – 905 (ఏసీ చైర్ కార్), 1775 (ఎగ్జిక్యూటివ్ క్లాస్ ), ఖమ్మం – 750 (ఏసీ చైర్ కార్, 1460 ( ఎగ్జిక్యూటివ్ క్లాస్ ), వరంగల్ -520 (ఏసీ చైర్ కార్, 1005 ( ఎగ్జిక్యూటివ్ క్లాస్ )

వైజాగ్ నుంచి సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 20833)

వైజాగ్ టూ సికింద్రాబాద్- 1720 ( ఏసీ చైర్ కార్) , 3170 (ఎగ్జిక్యూటివ్ క్లాస్ )
రాజమండ్రి టూ సికింద్రాబాద్ 1425( ఏసీ చైర్ కార్) 2535 (ఎగ్జిక్యూటివ్ క్లాస్ )
విజయవాడ టూ సికింద్రాబాద్- 1060 ( ఏసీ చైర్ కార్), 1915 (ఎగ్జిక్యూటివ్ క్లాస్ )
వరంగల్ టూ సికింద్రాబాద్- 725 ( ఏసీ చైర్ కార్), 1235 (ఎగ్జిక్యూటివ్ క్లాస్ )

హైదరాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ షెడ్యూల్

సికింద్రాబాద్ –విశాఖ మధ్య అత్యంత వేగంగా నడిచే రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express)నిలుస్తుంది. కేవలం ఎనిమిదన్నర గంటల్లోనే విశాఖ చేరుకోవచ్చు.

ఉదయం 5.45 కి వైజాగ్ ( ట్రైన్ నెంబర్ 20833) నుంచి బయలుదేరే ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, వరంగల్, ఖమ్మం మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 2.15కు చేరుకుంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ లో ( ట్రైన్ నెంబర్ 20833) 3 గంటలకు మొదలై వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా ప్రయాణించి రాత్రి 11.30 కు వైజాగ్ చేరుకుంటుంది.

రైల్వేశాఖ నిర్ణయించిన టైమింగ్స్ ప్రకారం విజయవాడలో 5 నిమిషాలు, రాజమండ్రిలో 2 నిమిషాలు ఆగుతుంది. ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్క నిమిషం మాత్రమే ఆగుతుంది. మిగిలిన స్టేషన్లలో 2 నిమిషాలు మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఇందులో 16 ప్యాసింజర్ కార్లు ఉంటాయి. 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ లు కాగా మిగిలినవి ఏసీ చైర్ కార్ కోచ్ లు. వీటిలో 1128 సీటింగ్ కెపాసిటీ ఉంది.

వందేభారత్ ప్రత్యేకలివీ

ట్రైన్ ఫ్రేమ్ పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేశారు. 80 శాతానికి పైగా రైలు (Vande Bharat Express) భాగాలను మన దేశంలోనే తయారు చేశారు. చెన్నైలోని పెరంబూర్లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ ట్రైన్ ను తయారుచేసింది. జీపీఎస్ ట్రాకింగ్ తో పాటు బయో వాక్యూమ్ టాయిలెట్స్ వందేభారత్ స్పెషల్.

అన్ని తరగతుల్లో ఏటవాలుగా ఆనుకొనే సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో అయితే 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు ఉన్నాయి. యాక్సిడెంట్లను నివారించే కవచ్ టెక్నాలజీని కూడా ఈ రైలులో వాడారు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా మరొక రైలు వస్తుంటే యాక్సిడెంట్ కాకుండా ఈ రైలు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.

అత్యవసర అలారం బటన్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్‌లు ఏర్పాటు చేసారు. వీటితో ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు సిబ్బందితో మాట్లాడొచ్చు. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్‌లు ఉంటాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/