SRH Vs RR : నాలుగేళ్ల తర్వాత మ్యాచ్ కోసం రెడీ అయిన ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ ఢీ

దాదాపు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి కనిపించబోతోంది. అందులోనూ హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆడబోతుండడంతో మ్యాచ్ పై ఆసక్తి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన తొలి మూడు మ్యాచుల్లో సొంత మైదానాల్లో

  • Written By:
  • Updated On - April 2, 2023 / 12:11 PM IST

SRH Vs RR : దాదాపు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి కనిపించబోతోంది. అందులోనూ హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆడబోతుండడంతో మ్యాచ్ పై ఆసక్తి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన తొలి మూడు మ్యాచుల్లో సొంత మైదానాల్లో ఆడిన టీమ్స్ విజయాలు అందుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో కూడా హైదరాబాద్ టీమ్ బోణి కొట్టాలని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కోరుకుంటున్నారు.

కాగా ఇప్పటి వరకు జరిగిన అహ్మదాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలవగా, మొహాలీలో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) గెలిచింది. మూడో మ్యాచ్‌లో హోం గ్రౌండ్‌లో లక్నో టీమ్ బోణీ కొట్టింది. అయితే 2019 లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉప్పల్ స్టేడియంలో చివరి సారి మ్యాచ్ ఆడింది. పంజాబ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో రైజర్స్ 45 పరుగులతో గెలిచింది.  ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం మొదటి మ్యాచ్ సన్‌ రైజర్స్ హైదరాబాద్‌–రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరగనుంది. మే 18న ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం 3 గంటల తరువాత మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 4-వీలర్లు, 2-వీలర్లను కలిపి పార్కింగ్ చేయడానికి మొత్తం 18 పార్కింగ్ స్థానాలు అందుబాటులో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్, హబ్సిగూడ, తార్నాక నుంచి వచ్చే క్రికెట్ అభిమానులు  తమ వాహనాలను IALA పార్కింగ్, పెంగ్విన్ టెక్స్‌టైల్ పార్కింగ్, 4 NGRI గేట్ నంబర్ 1 నుంచి 3, జెన్‌పాక్ట్ లేన్, జెన్‌పాక్ట్ నుంచి NGRI మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేసారు.

ఈరోజు జరగబోతున్న మ్యాచ్ కోసం ఉప్పల్‌ స్టేడియం అంతా ఆరెంజ్‌ ఆర్మీతో నిండబోతోందని అంతా భావిస్తున్నారు. వరుసగా రెండు సీజన్‌లలో వైఫల్యం నేపథ్యంలో కోచ్‌, కెప్టెన్‌తో సహా టీం మొత్తాన్ని దాదాపుగా మార్చేశారు. వార్నర్, విలియమ్సన్, విజయ్ శంకర్ లాంటి పలువురు ప్లేయర్లు హైదరాబాద్ కి దూరం అయ్యారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేయింగ్ XI : అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్(WK), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్(c), ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI :  యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ఒబెడ్ మెక్‌కాయ్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్.