Site icon Prime9

Upcoming Releases: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ ఇవే

Upcoming releases

Upcoming releases

Upcoming Releases: ఈ వేసవిలో పెద్దగా స్టార్ హీరోలు ఎవరూ తమ సినిమాలను విడుదలచేయలేదు. దానితో ఒకింత అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ థియేటర్లలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్‌ వద్ద ఈ వారం సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

‘టక్కర్‌’

‘ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్‌ను నిర్ణయిస్తుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి ధనమే ఇంధనం. దాని సంపాదించుకోవడానికి ఒక్కొక్కడిదీ ఒక్కో దారి. ఆ దారి అందరికీ ఒకటే అయినప్పుడు..’ అంటూ తన కథ చెబుతున్నారు సిద్ధార్థ్‌. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్‌ జి.క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్కర్‌’ ఈ సినిమా జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

‘అన్‌స్టాపబుల్‌’

వి.జె. సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించిన మూవీ ‘అన్‌స్టాపబుల్‌’. రజిత్‌ రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విమానం

వీరయ్య దివ్యాంగుడు అయినా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కొడుక్కి విమానం ఎక్కడం అంటే ఇష్టం. ఎప్పుడూ పదే పదే తండ్రిని అదే అడుగుతాడు. మరి తండ్రీ కొడుకుల ఈ విమానం చివరికి ఏమైందో తెలియాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు సముద్రఖని. ఈ సినిమా కూడా జూన్‌ 9న సినిమా విడుదల కానుంది.

‘పోయే ఏనుగు పోయే’

ఏనుగు కీలక పాత్రలో మాస్టర్‌ శశాంత్‌.. ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘పోయే ఏనుగు పోయే’. కె.ఎస్‌.నాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పవనమ్మాళ్‌ కేశవన్‌ నిర్మాత. ఈ సినిమా జూన్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు

సోనీలివ్‌

2018 (మలయాళం/తెలుగు) జూన్‌07

నెట్‌ఫ్లిక్స్‌

బర్రకుడ క్వీన్స్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 05
ఆర్నాల్డ్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 07
నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 08
టూర్‌ డి ఫ్రాన్స్‌(వెబ్‌సిరీస్‌)- జూన్‌ 08
బ్లడ్‌ హౌండ్స్‌ (కొరియన్‌ సిరీస్‌)- జూన్‌ 09

అమెజాన్‌ ప్రైమ్‌

మై ఫాల్ట్‌ (హాలీవుడ్‌)- జూన్‌ 08

జీ5

ది ఐడల్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 5

డిస్నీ+హాట్‌స్టార్‌

అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ (హాలీవుడ్)- జూన్‌ 07

సెయింట్‌ ఎక్స్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌07
ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌ (హాలీవుడ్)- జూన్‌ 09
ఫ్లామిన్‌ హాట్‌ (హాలీవుడ్‌)- జూన్‌ 10

జియో సినిమా

బ్లడ్‌ డాడీ (హిందీ)- జూన్‌ 09

యూపీ 65 (హిందీ సిరీస్‌)- జూన్‌ 08

యాపిల్‌ టీవీ ప్లస్‌

ది క్రౌడెడ్‌ రూమ్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 08

Exit mobile version