Who Is Zainab Ravdjee: త్వరలో అక్కినేని ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న క్రమంలో మరో శుభవార్త ప్రకటించింది. అక్కినేని వారసులిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నాగచైతన్య, శోభిత పెళ్లి ఫిక్స్ కాగా.. తాజాగా అఖిల్ నిశ్చితార్థం చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. నిన్న నిఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు నాగార్జున అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జైనాబ్ రావ్‌జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే కాబోయే కోడలి గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు నాగ్. దాంతో ఆ అమ్మాయి ఎవరూ? అక్కినేని ఇంటికి కాబోయే ఆ చిన్న కోడలి బ్యాగ్రౌండ్ ఎంటా? అంతా తెగ వెతికేస్తున్నారు.
హైదరాబాద్ అమ్మాయే.. కానీ
ఈ క్రమంలో ఆమె గురించి సమాచారం సోషల్ మీడియాలో ఎవరా? అంతా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో జైనాబ్ రావ్‌జీ పేరు ఒక్కసారిగా నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. జైనాబ్ రవ్‌జీ పెయింటర్ అని తెలుస్తోంది. ఆమెది హైదరాబాద్ నేపథ్య కుటుంబం. పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా పెరిగింది మాత్రం ముంబై, దుబాయ్, లండన్‌లో. అందుకు ఆమె పెయింట్స్ అన్ని కూడా ఆయా దేశాల సంప్రదాయాలు దర్శనమిస్తుంటాయి. హైదాబార్‌లోని ప్రముఖ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లో ఆమె చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీ పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఆమె వేసిన మోడ్రన్, అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ని ప్రదర్శించారట.
టబు సినిమాలో..
అలాగే జైనాబ్ ఓ సినిమాలోనూ నటించినట్టు తెలుస్తోంది. ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంతో ‘మీనాక్షి: ఏ టేల్ ఆప్ థ్రీ సిటీస్’ సినిమాలో జైనాబ్ ఓ కీలక పాత్ర పోషించింది. ఇందులో సీనియర్ నటి టబు, కునాల్ కపూర్ నటించారు. పెయింటర్‌గా మంచి గుర్తింపు పొందిన జైనాబ్ రవ్‌జీ మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. తన పేరతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. అయితే అది ప్రైవేట్‌లో ఉంది. ఆమెను ఉపాసన కొణిదెల, రానా దగ్గుబాటిలు ఫాలో అవుతుండటం కోసమెరుపు. చూస్తుంటే అఖిల్, జైనాబ్ ఎప్పటి నుంచో పరిచయం ఉందని, వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక జైనాబ్ అఖిల్ కంటే వయసులో పెద్దదనే టాక్ కూడా వినిపిస్తోంది.
జైనాబ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్
జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్‌జ్జీ, నాగార్జున మంచి సన్నిహితులని, బిజినెస్ పార్ట్‌నర్స్ అని కూడా తెలుస్తోంది. . వ్యాపార రీత్యా ఆమె తండ్రి దుబాయ్‌లో స్థిరపడినట్టు తెలుస్తోంది. అక్కడ ఆమె తండ్రికి ZR ఇన్‌ఫ్రా పేరుతో పలు కంపెనీలు ఉన్నాయట. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జుల్ఫీ రావ్‌జీని తన కెబినేట్ ర్యాంక్‌లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేవ్ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారని సమాచారం.