Site icon Prime9

Tugs of Thandel: ‘థగ్స్ ఆఫ్‌ తండేల్‌’ – రిలీజ్‌ డేట్‌ కోసం పోటీపడ్డ టీం! ఆకట్టుకుంటున్న వీడియో

Thandel Tugs of War: నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ తండేల్‌. చందు మొండేటి దర్శకత్వంలో పాన్‌ ఇండియాగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. అయితే మొదట తండేల్‌ను డిసెంబర్‌ 20న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటిచింది. అయితే అప్పుడే అల్లు అర్జున్‌ పుష్ప 2 ఉండటం, షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా వేశారు. దీంతో తండేల్‌ రిలీజ్‌పై డైలామా నెలకొంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా సమ్మర్‌కు వస్తుందా? అనే కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్లారు ప్రేక్షకులు.

దీంతో తండేల్‌ రిలీజ్‌ ఎప్పుడు అంటూ సోషల్‌ మీడియాలో, మూవీ ఈవెంట్స్‌లో సెలబ్రిటీలకు దీనిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. తండేల్‌ రిలీజ్ డేట్‌ ప్రకటించాలంటూ ఫ్యాన్స్‌ మూవీ టీం రిక్వెస్ట్‌ చేసింది. ఈ క్రమంలో దీనిపై రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. ఫైనల్‌గా మూవీ టీం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మరి తండేల్‌ తండేల్‌ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేసింది మూవీ టీం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన తండేల్‌ను విడుదల చేస్తున్నట్టు స్వయంగా అల్లు అరవింద్‌ వెల్లడించారు. ఈ ప్రకటన అక్కినేని ఫ్యాన్స్‌ అంతా ఖుష్‌ అయ్యారు.

ఇటీవల తండేల్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ టీం తాజాగా ఓ ఫన్నీ వీడియో షేర్‌ చేసింది. మూవీ సెట్‌లో హీరో, డైరెక్టర్‌తో పాటు చిత్ర బృందం కలిసి ‘థగ్‌ ఆఫ్ తండేల్‌’ అని పేరు పెట్టి ఆట ఆడిన వీడియో షేర్ చేసి ఆకట్టుకున్నారు.  చూడటానికి ఇది గేమ్‌ అయినా.. తండేల్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌ చేయడానికి మూవీ టీం ఎంతగా ప్రెజర్‌ పడిందో ఈ వీడియో ద్వారా చూపించారు. మూవీ టీం రెండు టీంలుగా విడిపోయి థగ్‌ ఆఫ్‌ వార్‌ ఆడారు. అందులో ఒక టీం పేరు సంక్రాంతి, మరో టీం పేరు సమ్మర్‌. ఇలా సంక్రాంతి, సమ్మర్‌ టీం మధ్య జరిగిన ఈ పోటీ చివరికి ఎవరూ గెలవకపోవడంతో ఫిబ్రవరిని ఎంచుకున్నట్టు ఈ వీడియోలో చూపించారు.

అసలు విషయాన్ని చెప్పేందుకు మధ్యలో నిర్మాత అల్లు అరవింద్‌ వచ్చి శ్రీకాకుళం యాసలో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ ఫన్నీగా అనిపించింది. దున్నగొట్టడానికి మీరు మీరు కొట్టుకుంటే ఏలా, నాకు వదిలేయండయా ఈ గొల. ఎప్పుడు దులగోట్లాలో చెప్పడానికి నేను వెయ్యాలయ్యా ఈళ అంటూ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఇక అల్లు అరవింద్‌ ఈళ వేస్తుండగా… తండేల్‌ రిలీజ్‌ డేట్‌ స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యింది. ఫిబ్రవరి 27, 2025 అంటూ విడుదల తేదీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ థగ్‌ ఆప్‌ తండేల్‌ వీడియో బాగా ఆకట్టుకుంది. ఇలా సరికొత్త మూవీ రిలీజ్ డేట్‌ వాయిదాపై వివరణ ఇచ్చి ఆడియన్స్‌ని ఆకట్టుకుంది టీం. కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.

Exit mobile version