Site icon Prime9

TS Eamcet 2022 Results: తెలంగాణ ఎంసెట్, ఈ సెట్ ఫలితాల విడుదల

Hyderabad: తెలంగాణ ఎంసెట్, ఈ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 ఉత్తీర్థన సాధించగా, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం, ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణీలయ్యారు. ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, కళాశాలల వివరాలు, కోర్సుల వివరాలు కౌన్సిలింగ్ సెంటర్ లో వెల్లడిస్తారని తెలిపారు.

జూలై 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్, 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్​కు లక్షా 56 వేల 812 మంది, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం 80 వేల 575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈనెల 1న నిర్వహించిన ఈసెట్ కు 9 వేల 402మంది హాజరయ్యారు.

Exit mobile version