Site icon Prime9

Rajanala Srihari : మద్యం బాటిళ్లను పంచిన టిఆర్ఎస్ నేతలు

TRS leaders distributed liquor bottles

TRS leaders distributed liquor bottles

Warangal: ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన వ్యక్తులే బహిరంగంగా ప్రవర్తిస్తున్నారు. పేదలను మరింత పేదలుగా మార్చే ఎత్తుగడలకు వారికి వారే నిర్ణయం తీసుకొంటున్నారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. సారూ…దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు..మజా చేసుకోండి..కుషీగా ఉండండి అంటూ అధికార పార్టీ నేతలు బహిరంగంగా మద్యం, కోళ్లను ఉచితంగా పంచి పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకొనింది.

వివరాల్లోకి వెళ్లితే…టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపటిదినం దశర నాడు జాతీయ పార్టీపై కీలక ప్రకటనను కేసిఆర్ చేయనున్నారు. దీంతోపాటు పార్టీ గుర్తు, మునుగోడు ఉప ఎన్నికలపై కేసిఆర్ ప్రసంగించనున్నారు.

ఇప్పటికే కొద్ది రోజులుగా టీఆర్ఎస్ నేతలు దేశాన్ని బాగుచేసేందుకే కేసిఆర్ జాతీయ పార్టీ ఆరంగ్రేటం అంటూ రోజు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో కేసిఆర్ జాతీయ స్థాయిలో సత్తా చాటాలని, అధ్భుతమైన విజయం సాధించాలంటూ ఆలయాల్లో పూజలు, ప్రార్ధనలు టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టారు.

అంతేనా.. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి మరో అడుగు ముందుకేసి బహిరంగంగానే కోళ్లు, మద్యం బాటిళ్లు పంచిపెట్టి తన సత్తా చూపించారు. పేద హమాలీలకు 200 కోళ్లతో పాటు 200 క్వార్టర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కేసిఆర్ ప్రధానమంత్రి కావాలని, ఆయన కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ మద్యం, కోళ్ల పంపిణీ చేపట్టడం రాజకీయంగా వైరల్ అయింది. మద్యం బాటిళ్లను పంచుతున్న ఫోటోలో నెట్టింట హల్ చేసాయి.

అధికార టీఆర్ఎస్ శ్రేణులు మద్యం బాటిళ్లు పంచుతూ ఏమని ప్రజలకు సందేశం ఇస్తున్నారో అర్ధం కాలేదు. పార్టీ హోదాపైనే ఇంతగా చేపడితే, ఇక ఎన్నికల్లో ఎలాంటి అభ్యంతకరం పనులు చేస్తారో ఇట్టే తెలిసిపోతుంది. ఏది ఏమైనా రాజకీయాలు భ్రష్టు పట్టాయని పేర్కొనడానికి టీఆర్ఎస్ శ్రేణులు ఓ ఉదాహరణగా మారడంపై ప్రజలు చర్చించుకొంటున్నారు.

ఇది కూడా చదవండి:National Green Tribunal: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి షాక్…3800 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం

Exit mobile version