Site icon Prime9

Kishan Reddy: దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ మాటలు అవివేకమే..కిషన్ రెడ్డి

TRS as an alternative to BJP in the country are foolish

TRS as an alternative to BJP in the country are foolish

BJP vs TRS: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ పార్టీ తీరును కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయ పార్టీగా టీఆర్ఎస్ గా అభివర్ణించడం టీఆర్ఎస్ పార్టీ అవివేకమన్నారు. కల్వకుంట్ల సభ్యులు ఏకైక అజెండాగా భాజపాపై, ప్రధాని మోదీ ప్రభుత్వంపై అబద్ధాలు ఆడుతూ విష ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. దేశంలో అదే పనిగా భాజపాను విమర్శిస్తున్నది అంటే టీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబమేనన్నారు.

జాతీయ పార్టీని పెట్టకముందే కేసీఆర్ ఫాం హౌస్ లో పగటి కలలు కంటున్నారన్నారు. ప్రధానిగా కేసిఆర్, ప్రధాని మంత్రిత్వ శాఖకు కవిత, తెలంగాణ సీఎంగా కేటీఆర్ ను ఊహించుకొంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని పలు నేతల్ని, పార్టీలను కలుసుకొంటున్నారన్నారు. అయితే కేసిఆర్ పై కీలక పార్టీ నేతలకు నమ్మకం లేదన్నారు. అందుకే ముందుకు రావడం లేదన్నారు. కేసిఆర్ అభిప్రాయాలను ఏకీభవించడం లేదని బహిరంగంగానే మాట్లాడుతున్నారని, ఉదాహరణకు సీఎం నితీష్ కుమార్ సమక్షంలో కేసిఆర్ మాట్లాడుతుండగా ఆయన లేచిపోవడాన్ని పరోక్షంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

ప్రగతి భవన్ లో ఉపన్యాసం అయిన తర్వాత ఆ పార్టీ నేతలే తలలు పట్టుకొంటున్నారని భావిస్తున్నారన్నారు. జాతీయ పార్టీ పెట్టడంలో ఉన్న ఉపయోగాలు ఏంటని లోలోపల ప్రశ్నించుకొంటున్నారని కేంద్ర మంత్రి అన్నారు. ఇదొక వింత పోకడగా ఉందంటూ విధిలేక కేసిఆర్ మాటలు వింటున్నారని వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీని బలపరచడం కోసమే ఇదంతా కేసిఆర్ చేస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ పై ప్రగతి భవన్ వద్దకు వచ్చాడన్నాడు. జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటుపై ఓవైసీతో చర్చించారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీతో కుమ్ముక్కై దేశమంతా తిరిగేందుకే సొంతంగా విమానం కొంటున్నారని పార్టీ నేతలే పేర్కొంటున్నారని కేంద్ర మంత్రి అన్నారు. విరుద్ధ ఆలోచనలతో పార్టీ పెట్టిన నేతలు, పార్టీలు బతికి బట్టకట్టిన్నట్లు ప్రపంచంలో ఎక్కడా లేదని గుర్తుంచుకోవాలని కేసిఆర్ అండ్ టీం కు కిషన్ రెడ్డి హితవు పలికారు.

కల్వకుంట్ల కుటుంబం భవిష్యత్ అంధకారంలోకి చేరుకోబోతుంది, ప్రభుత్వ పాలన పట్ల, ప్రజలు అసహ్యించుకొంటున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకు ప్రత్యామ్మయమే జాతీయ పార్టీ ఏర్పాటుకు ప్రధాన ఉద్ధేశంగా కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. అధికార పార్టీ చేసిన తప్పులు, టీఆర్ఎస్ లో ఉన్న అసమ్మతిని తగ్గించడం, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకు, అవినీతి నుండి దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ ఆటగా కేసిఆర్ ఆడుతున్నాడని విమర్శించారు. తెలంగాణలో కేసిఆర్ కాళ్ల కింద భూమి కదులుతొందని, కాబట్టే జాతీయ స్థాయి నాటకానికి తెరదీశారని హేళన చేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారానికి తెరతీయాలని హితవు పలికారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా పార్టీని నెలకొల్పుకోవచ్చన్న కిషన్ రెడ్డి, వ్యవస్థలను వాడుకొంటున్నట్లు భాజపాను విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతులు ఒకటి గుర్తుంచుకోవాలన్నారు. వాస్తవాలను చెబితేనే ప్రజలు వింటారన్నారు. కేసిఆర్ తొండి ఆటకు భాజపా పార్టీనే చెక్ పెడుతుందని కేంద్ర మంత్రి ధీమాను వ్యక్తం చేశారు. న్యాయం, ధర్మమే తెలంగాణాలో నిలుస్తుందన్నారు. నిజాన్ని గ్రహించే స్ధితిలోకి ప్రజలు చేరుకొన్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బలిదానాల చేసుకొన్నది టీఆర్ఎస్ పార్టీ కోసం కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరే రోజులు ఎంతో దగ్గరలో లేవని పేర్కొన్నారు.

2014లో పేర్కొన్నదళితుడి ముఖ్యమంత్రి మాటేంటని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఆ విషయంలో వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా కేసిఆర్ వ్యవహరించడం నిజం కాదా అని అడిగారు. భూకంపం, ప్రళయం మంటే తెలంగాణ ప్రజలు ఏంటో అనుకొన్నారు. తీరా చూస్తే టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించడమేనా భూకంపంగా నవ్వుకొన్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీ జాతీయ పార్టీలుగా ఉన్నాయన్నారు. పార్టీ పెట్టుకోవడం పెద్ద కష్టం కాదన్నారు. చివరివరకు ప్రజల పక్షాన ఉన్నామా లేదా చూసుకోవలన్నారు. ఎన్నో జాతీయ పార్టీలు కనుమరుగైన సంగతి కూడా గమనించండి అంటూ పేర్కొన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో 50శాతం గెలుపు దక్కించుకొన్న టీఆర్ఎస్ ప్రభ, అనంతరం మరింత దిగజారిందని కేసిఆర్ గుర్తు పెట్టుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

మీడియా సమావేశం అనంతరం కిషన్ రెడ్డి తిలక్ నగర్ లోని ఫీవర్ ఆసుపత్రికి అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్సును ఉచితంగా ఇచ్చిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసిఐఎల్, ఏబీవి ఫౌండేషన్ వారు ఉచితంగా అంబులెన్సును ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి స్వయంగా అంబులెన్సును నడిపి ఫీవర్ ఆసుపత్రి అధికారులకు అందచేశారు.

ఇది కూడా చదవండి: Prathipati Pulla Rao : విడదల రజిని పై మండిపడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Exit mobile version