Site icon Prime9

Traffic Rules : సచివాలయం ప్రారంభోత్సవ నేపధ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

traffic restrictions in hyderabad due to new secretariat inaguaration

traffic restrictions in hyderabad due to new secretariat inaguaration

Traffic Rules : నేడు తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం నుంచి పూజలు, హోమాలు మొదలయ్యాయి. దీంతో వీవీఐపీ, వీఐపీల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో వాహనాలను అనుమతించకుండా రోడ్లను క్లోజ్ చేయనున్నారు.

ఏ ఏ రోడ్లు బంద్ అంటే (Traffic Rules)..

వీవీ విగ్రహం-నెక్లెస్ రోటరీ-తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ- పీవీఎన్ఆర్ మార్గ్ -నల్లగుట్ట మార్గాలను పూర్తిగా మూసివేయనున్నారు.

వీవీ విగ్రహం జంక్షన్, పాత సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కాపౌండ్ జంక్షన్, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుంట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ల వైపు ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. వాహనదారులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

కర్బలా-రాణిగంజ్-సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ట్యాంక్‌బండ్ వద్ద అనుమతించనున్నారు.

ఇక ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్-ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. ఈ మార్గంలో వచ్చే వాహనదారులను తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద మళ్లించనున్నారు.

ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్ పార్కింగ్ పక్కన, ఫార్ములా ఈ రేస్ రోడ్, బీఆర్కే భవన్ లైన్, నెక్లెస్ రోడ్డులో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ట్రాఫిక్ సూచనలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులకు తమకు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ నియమాలకు సంబంధించి రూట్ మ్యాప్ లను కూడా పోస్ట్ చేశారు.

ఈ క్రమంలో సచివాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 మంది బెటాలియన్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. రెండు షిఫ్ట్‌ల విధుల్లో 600 మంది పోలీస్ సిబ్బంది, అదనంగా 500 మంది పోలీసులు సచివాలయం పరిసరాల్లో అందుబాటులో ఉంటారు. సచివాలయం ప్రాంతంలో 300 సీసీ కెమెరాల ద్వారా భద్రతను పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆరు టీములు డాగ్ స్క్వాడ్ & బాంబ్ స్క్వాడ్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా రెండు అక్టోపస్ బృందాలను అందుబాటులో ఉంచారు. అదనపు పోలీస్ కమిషనర్ నేతృత్వంలో బందోబస్తు పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇదిలాఉంటే, సెక్యూరిటీ బ్రీఫింగ్‌లో ఇప్పటికే పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వరకు సచివాలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఉంటుంది.

Exit mobile version