Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల పుష్ప ఈ ప్రీమియర్ వేసిన సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగగా.. ఈ ఘటన ఓ మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. గతవారం కేసు నమోదు అవ్వగా తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్ నాగరాజు, విజయ్ చందర్‌ని కూడా అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో ముగ్గురిపై BNS 105, 118(1)r/w3(5) సెక్షన్ల కింది కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ఎల్ రమేష్ వెల్లడించారు. తాజాగా ఈ కేసులో బన్నీని కూడా అరెస్ట్ అవ్వడం హాట్‌టాపిక్ మారింది. కాగా అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప డిసెంబర్ 5న రిలీజైంది. అయితే ఆ ముందు రోజు మూవీ ప్రీమియర్స్ వేశారు. సంధ్య థియేటర్లో బెన్‌ఫిట్ షో వేశారు. దీంతో సినిమా చూసేందుకు ఆడియన్స్ భారీ సంఖ్యలో వచ్చారు.
అయితే అదే సమయంలో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు వచ్చారు. హీరో అల్లు అర్జున్ వచ్చాడని తెలిసి ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈక్రమంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ఆమె కుమారుడు కిందపడటంతో జనం వారిని తొక్కుక్కుంటూ ముందుకు వెళ్లారు. ఈక్రమంలో ఊపిరి ఆడక సదరు మహిళ మరణించగా.. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే థియేటర్‌కు అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రావడంతో అక్కడ ఎలాంటి భద్రత చర్యలు తీసుకోడానికి వీలుకాలేదు. ఈ క్రమంలోనే బన్నీ చూసేందుకు జనం ఎగబడటంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠి ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది.