Site icon Prime9

Vijay Devarakonda: ఆర్జీవీ మేనకోడలితో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిదాంబి శ్రీకాంత్‌ పెళ్లి – టాలీవుడ్‌ తారలు సందడి

Kidambi Srikanth and Shravya Reddy Wedding: బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహిత కిదాంబి శ్రీకాంత్‌ ఓ ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్‌ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మను శ్రీకాంత్‌ పెళ్లాడాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీతారలు, స్పోర్ట్స్‌ పర్సన్స్‌ హాజరై నూతన వధువరులను ఆశీర్విదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ పెళ్లికి నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, వంశీ పైడిపల్లి పలువురు హాజరయ్యారు.

అలాగే హీరో విజయ్‌ దేవరకొండ కుటుంబంతో సహా ఈ వివాహ మహోత్సవానికి హజరై సందడి చేశాడు. కాగా ఫ్యాషన్‌ డిజైనర్‌గా శ్రావ్య వర్మకు టాలీవుడ్‌ మంచి గుర్తింపు ఉంది. కీర్తి సురేష్‌ ‘గుడ్‌ లక్‌ సఖి’ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరించింది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా శ్రావ్య వర్మ కిదాంబి శ్రీకాంత్‌తో ప్రేమలో ఉంది. ఎప్పుడో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

Exit mobile version