Site icon Prime9

MuraliMohan: మురళీమోహన్ @ 50 ఇయర్స్ ఇన్ టాలీవుడ్.. ఆయనే నాకు ఆదర్శం అంటూ..!

murali mohan

murali mohan

MuraliMohan:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మురళీ మోహన్. ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించి సందడి చేశారు. అలాగే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన మురళీమోహన్ ఈ మధ్యకాలంలో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు.

సినీ జీవితం(MuraliMohan)

మురళీ మోహన్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడిగా ఫేమస్.. హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన మురళీ మోహన్ తన సినీ ప్రయాణాన్ని 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో మురళీ మోహన్ వెండితెరపై అడుగు పెట్టారు. 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన తిరుపతి సినిమాతో మురళీ మోహన్ కు మంచి నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 350సినిమాల్లో నటించారు.

టాలీవుడ్ లో అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీ మోహన్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను వెండి తెరకు పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు, పీవీ సుబ్బారావుగార్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడాయన మనసు మార్చుకున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తానని చెబుతున్నారు.

మురళీమోహన్ తన మనసులో మాటను ఇలా వెల్లడించారు… “నేను ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు నా వయసు 33 ఏళ్లు. ఓ పదిహేనేళ్లు ఇండస్ట్రీలో ఉంటానేమో అనుకున్నాను. ఇప్పుడు నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ల పూర్తయ్యాయంటే ఆశ్చర్యంగా ఉంది. అదృష్టం కలిసిరావడంతో పాటు, అందరి సహకారం నాకు లభించడంతో ఇన్నేళ్ల ప్రస్థానం సాధ్యమైంది.

అనుకోకుండా రాజకీయాల వైపు (MuraliMohan)

నటుడ్ని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుంచి నా ఆసక్తి అంతా వ్యాపారం మీదనే. ఇక రాజకీయాలు అంటారా.. అది అనుకోకుండా జరిగిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాలకు పదేళ్ల విరామం వచ్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను.

వ్యాపారాలు కూడా మా కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. ఇకపై నేను పూర్తిగా సినిమాలకే అంకితం అవుతా. చనిపోయేంత వరకు నటిస్తూ ఉండాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించిన అక్కినేని నాగేశ్వరరావే నాకు స్ఫూర్తి. ఆయన తన మాట నిలుపుకున్నారు. ఆరోగ్యం దెబ్బతిన్నా, ఆయన చివరి రోజుల్లో మనం సినిమాలో నటించారు. నేను కూడా ఆయన బాటలోనే నటనకు సంపూర్ణంగా అంకితం అవుతా” అని వివరించారు.

మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. 1940, జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. టాలీవుడ్ నటుడు, నిర్మాత. జయభేరి గ్రూపు అధిపతి, రాజకీయ నేత గా తనకంటూ ఓ ప్లేన్ సొంతం చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ‘మిథునం’ చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి రాసిన ‘అమ్మే దైవం’ పాట వీడియోను రిలీజ్‌ చేశారు మురళీమోహన్‌.

Exit mobile version