Site icon Prime9

Actor Ali: అక్రమ నిర్మాణాల ఆరోపణలు – నటుడు అలీకి లీగల్‌ నోటీసులు

Ali Got legal Notice

Ali Got Legal Notice: కమెడియన్‌ అలీ వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడతున్నారనే ఆరోపణలతో తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండంలోని ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభరాణి.. అలీ ఫామ్ హౌజ్‌లోని పనిమనుషులకు నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు.

కాగా వికారాబాద్ ఎక్‌మామిడి గ్రామంలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. ఆ స్థలంలో ఫామ్‌ హౌజ్‌ నిర్మించుకుని ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో వెళ్లి సరదాగా సమయంలో గడిపి వస్తుంటారు. అయితే ఇది అక్రమ కట్టడంగా గ్రామ కార్యదర్శి శోభారాణి గుర్తించారు. దీంతో అనుమతి లేకుండా ఆ స్థలంలో ఫామ్‌ హౌజ్‌ నిర్మించడమే కాకుండా, పన్ను చెల్లించకుండా నిర్మాణాలు చేపట్టారని ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నవంబర్‌ 5న నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు అలీ దానిపై స్పందించలేదు. దీంతో ఇప్పుడు మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేశారు. అలీ అందుబాటులో లేకపోవడంతో పనివాళ్లు నోటీసులు ఇచ్చినట్టు ఆమె తెలిపారు.

Exit mobile version