Site icon Prime9

Sarpanch Attack: దారుణ ఘటన.. దివ్యాంగుడని కూడా చూడకుండా దాడి..!

sarpanch attack on disable person

sarpanch attack on disable person

Sarpanch Attack: బాధ్యతగత పదవిలో ఉండి బాధ్యత మరచి ప్రవర్తించాడు. సాయం చెయ్యాల్సింది పోయి నిర్దయగా ప్రవర్తించాడు. దివ్యాంగుడని కూడా చూడకుండా అమానుషంగా అతనిపై దాడి చేశాడు ఓ కటినాత్ముడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబ్ నగర్లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం పుల్పోనిపల్లి సర్పంచ్ శ్రీనివాసులు అదే గ్రామానికి చెందిన ఓ దివ్యాంగుడిపై దాడి చేశాడు. ఉపాధి హామీ కూలిడబ్బులు సక్రమంగా రావట్లేదని, ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలియజేయాలని దివ్యాంగుడైన కృష్ణయ్య మండల అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్‌ శ్రీనివాసులు గురువారం సాయంత్రం కృష్ణయ్య ఇంటికి వెళ్లి అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అడిగాడు. దానికి కృష్ణయ్య నేనేం ఇబ్బంది పెట్టలేదు నాకు రావాల్సి డబ్బు గురించే మాత్రమే అడిగాను అని సమాధానం ఇస్తాడు.

ఈ క్రమంలో ఆక్రోషానికి గురైన సర్పంచ్‌ శ్రీనివాసులు కృష్ణయ్యపై దాడి చేశాడు. ఈ నేపథ్యంలో దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన ఎస్పీ సర్పంచ్ శ్రీనివాసులను వెంటనే అరెస్ట్ చెయ్యాలంటూ స్థానిక ఎస్సై రవినాయక్‌ను ఆదేశించారు.
ఈ మేరకు సర్పంచ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్సై తెలిపారు. అలాగే సర్పంచ్‌ను శ్రీనివాసులను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్టు కలెక్టర్‌ వెంకట్రావు వెల్లడించారు.

ఇదీ చదవండి: రాత్రి 7 అయితే ఆ ఊర్లో టీవీలు, సెల్‌ఫోన్లు అన్నీ బంద్..!

Exit mobile version