KTR: మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ ? అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్.. ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాసల మధ్య పోటీ అని ట్వీట్ చేశారు.
ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యమన్నారు. దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదని పేర్కొన్నారు కేటీఆర్. తెరాస ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పిందని వాజ్ పేయ్ ఫోటోను షేర్ చేశారు కేటీఆర్.
ఫ్లోరైడ్ నల్లగొండ జిల్లాను ఏళ్లతరబడి వెంటాడి వేల మందిని జీవచ్ఛవంలా మార్చింది. కాళ్లు, చేతులు వంకర పోవడంతో.. ఏ పని చేయలేని స్థితిలో ఉండిపోయి, అనేక బాధలను అనుభవించారు. వీరి గోడును మీడియా కూడ ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకు వచ్చింది. ఇపుడు తాజాగా కేటీఆర్ తమ ప్రభుత్వమే ఫ్లోరోసిస్ నుంచి ప్రజలను విముక్తి చేసిందని ఈ విషయం కేంద్రమే వప్పుకుందని అన్నారు.
ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యం
దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదు
తెరాస ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పింది pic.twitter.com/8rLMEcaM44
— KTR (@KTRTRS) October 3, 2022