Site icon Prime9

Thangalaan: తంగలాన్ మేకింగ్ వీడియో రిలీజ్.. విక్రమ్ ను వేరే లెవెల్ లో ప్రెజెంట్ చేసిన పా రంజిత్

thangalaan

thangalaan

Thangalaan: తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాలో గెటప్స్ కోసం.. ఎంత ఎఫర్ట్ పెడతారో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అతడి సినిమాలు ఫెయిల్ అయినా.. అతడి నటన మాత్రం గుర్తుండిపోతుంది. ఇక త్వరలో విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాతి పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే సినిమా రాబోతుంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

Thangalaan - Exclusive Making From the Sets | Chiyaan Vikram | Pa Ranjith | G V Prakash Kumar

ఊర మాస్ లుక్.. (Thangalaan)

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాలో గెటప్స్ కోసం.. ఎంత ఎఫర్ట్ పెడతారో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అతడి సినిమాలు ఫెయిల్ అయినా.. అతడి నటన మాత్రం గుర్తుండిపోతుంది. ఇక త్వరలో విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాతి పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే సినిమా రాబోతుంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

పొన్నియిన్ తర్వాత విక్రమ్ తంగలాన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

విక్రమ్, రంజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇందులో పార్వతి, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

వందల ఏళ్ళ క్రితం కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా తంగలాన్ సినిమా నుంచి మేకింగ్ వీడియో విడుదలైంది.

ఇక ఈ మేకింగ్ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి.

విక్రమ్ తన భూమిని అణచివేతదారుల నుండి రక్షించడానికి బయలుదేరిన నాయకుడి లా కనిపించాడు.

యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాకు తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర కోసం విక్రమ్ చాలా కష్టపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో ఎత్తు. కెఇ జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

57 ఏళ్ల వయసులో విక్రమ్ ఈ రేంజ్ లో కష్టపడటం చూసి.. అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఈ సినిమా కోసం విక్రమ్ పెట్టిన ఎఫెర్ట్స్ చూసి ఆయన్ను నెటిజెన్లు అభినందిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar