Site icon Prime9

Tesla Naatu Naatu : “టెస్లా” నాటు నాటు.. గూస్ బంప్స్ పక్కా.. స్పందించిన ఎలాన్ మస్క్

tesla naatu naatu cars dancing video goes viral on social media

tesla naatu naatu cars dancing video goes viral on social media

Tesla Naatu Naatu : “ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్  గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు. ఆస్కార్ అందుకోవడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు అంతా మూవీ టీంకి అభినందనలు తెలియజేస్తున్నారు.

150 టెస్లా కార్లతో.. నాటు నాటు (Tesla Naatu Naatu)

ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఎడిసన్ నగరం న్యూ జెర్సీ లో పాపియోనా పార్క్ లో టెస్లా లైట్ షో ను నిర్వహించారు. సుమారు 150 టెస్లా కార్లు ఈ ఫీట్ లో పాల్గొన్నాయి. ఈ కారులు అన్నిటిని ఆర్ఆర్ఆర్ షేప్ లో పార్క్ చేసి ‘నాటు నాటు’ పాటకు లైట్ షో ను నిర్వహించారు. ఒక సినిమాకి ఇటువంటి లైట్ షో ను నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ లైట్ షో చూడటానికి కేవలం టెస్లా ఓనర్స్ మాత్రమే కాకుండా, దాదాపు ఒక 500 మంది హాజరయ్యారు.

దాదాపు 150 టెస్లా కార్స్ హెడ్ లైట్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని సింక్ చేస్తూ లైట్ షో చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కాగా సదరు వీడియో ని ఆర్ఆర్ఆర్ టీం రీ ట్వీట్ చేస్తూ థాంక్యూ చెప్పగా.. ఆ ట్వీట్ కి ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) రిప్లై ఇచ్చాడు. రెండు హార్ట్ సింబల్స్ తో ఆర్ఆర్ఆర్ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మొన్న కొరియన్ ఎంబసీ, ఆ తరువాత జర్మన్ ఎంబసీ అధికారులు నాటు నాటు పాటకి చిందేయడం. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా నాటు నాటు పాటకి రిప్లై ఇవ్వడం చూసి ఆర్ఆర్ఆర్ రేంజ్ మాములుగా లేదుగా అంటున్నారు నెటిజన్లు.

కాగా ఈ లైట్ షో కార్యక్రమం సక్సెస్ లో నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ సభ్యులు వంశీ కొప్పురావూరి, ఉజ్వల్ కుమార్ కస్తల ప్రముఖ పాత్రను వహించారు. ఎడిసన్ నగర మేయర్‌ సామ్‌ జోషి మరియు అతని బృందం అతి తక్కువ టైములో సహకరించి దీనిని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో జరగడం విశేషం.

Exit mobile version