Telangana: దేశమంతా ఆధార్ నెంబరుకు ఓటరు కార్డు లింక్ చేసుకోవాలన్న కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలతో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 75రోజుల్లో కోటిమంది ఓటర్ కార్డులు ఆధార్ కు లింక్ చేసుకొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఎన్నికల్లో దొంగ ఓట్లను అరికట్టడమే ప్రధాన ఉద్దేశం కాగ, ఇప్పటికే బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా అవసరాలకు ఆధార్ అనుసంధానం అనే మాటలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.