Batchula Arjunudu : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో వెంటనే ఆయనను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
గుండెనొప్పిగా గుర్తించిన విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు.
ప్రస్తుతం బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉండడంతో .. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
24 గంటలు గడిచాక మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నట్లు వివరించారు.
బచ్చుల అర్జునుడు 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన విషయం తెలిసిందే.
ఆయన స్వస్థలం మచిలీపట్నం. గతంలో ఆయన మచిలీపట్నం మునిసిపాలిటీ ఛైర్మన్ గానూ అర్జునుడు పని చేశారు.
2014లో ఆయన కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు.
ప్రస్తుతం టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ ఉన్నారు.
బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు.
అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకుని కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు వస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారని తెలుస్తుంది.
ఇటీవలే బచ్చుల అర్జునుడు టీడీపీ నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/