Site icon Prime9

S.V Rangarao: బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన ఎస్వీ రంగారావు మనవళ్లు.. మా అనుబంధాన్ని పాడుచెయ్యవద్దంటూ విజ్ఞప్తి

sv rangarao grand sons

sv rangarao grand sons

S.V Rangarao: నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ సభ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ వేడుకలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు.

వేద శాస్త్రాలు, నాన్నగారి డైలాగులు.. ఆ రంగారావు .. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అని అన్నారు.

ఇక్కడ బాలయ్య అక్కినేని తొక్కినేని అని అనడంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా తప్పు బడుతున్నారు.

దీంతో బాలయ్యపై సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత కూడా వచ్చింది.

ఉద్దేశపూర్వకంగా అన్నారో లేక కావాలని అన్నారో అన్న విషయం పక్కన పెడితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లతో హర్ట్ అయ్యారు.

తాజాగా బాలయ్యకు హీరోలు నాగ చైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

అక్కినేని వారసులైన యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఆ ప్రెస్ నోట్ లో.. ఎన్టీఆర్ గారు, రంగారావుగారు, నాగేశ్వరరావు గారు తెలుగు కళామ్మ తల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ వారు రాసుకొచ్చారు.

అయితే తాజాగా  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు(S.V Rangarao) మనవళ్లు స్పందించారు.

మా అనుబంధాన్ని పాడు చెయ్యొద్దు..

ఈ సభలో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావును బాలకృష్ణ అవమనించారంటూ వస్తున్న వార్తలపై వారు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

అందులో వారు మాట్లాడుతూ.. బాలకృష్ణ మాటల్లో తమకు ఎలాంటి వివాదమూ కనిపించలేదన్నారు.

బాలకృష్ణతో తమకు మంచి సంబంధం ఉందని, కాబట్టి ఈ వివాదాన్ని ఇంకా సాగదీసి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పాడు చేయొద్దని కోరారు.

తాము ఒకే కుటుంబంలా ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన సాధారణ పోకడలో చెప్పారని అన్నారు.

ఈ విషయంలో తమకు ఎలాంటి వివాదం కనిపించడం లేదని ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్‌వీఎల్ఎస్ రంగారావు (బాబాజీ) విజ్ఞప్తి చేశారు.

అక్కినేని అభిమానులు బాలయ్యపై మండిపడుతున్నారు. అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు.

లేకుంటే పరినామాలు  తీవ్రంగా ఉంటాయి అంటున్నారు అక్కినేని అభిమాన సంఘాలు.

ఈక్రమంలోనే బాలయ్య దిస్టి బొమ్మను కూడా దహనం చేశారు అక్కినేని ఫ్యాన్స్.

అక్కినేని పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు నరక్తి సెంటర్ లో ఏఎన్నార్ అభిమానులు ఆందోళనకు దిగారు.

బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటూ  వారు డిమాండ్ చేశారు.

మరోవైపు ఎల్లుండి నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో బాలయ్య క్షమాపణ చెప్పకుండే లోకేష్ యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు కాపు నేతలు.

ఈరోజు సాయంత్రంలోపు బాలయ్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాపునాడు నిన్న అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణకు కాపునాడు పెట్టిన డెడ్ లైన్ నేటి సాయంత్రంతో ముగియనుంది.

అయితే నందమూరి బాలకృష్ణ  మాత్రం ఇప్పటి వరకూ క్షమాపణలు చెప్పలేదు. మరి తరువాతి పరిణామాలు ఎలా  ఉంటాయో చూడాలి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version