Site icon Prime9

AP Capital Issue : నేడు సుప్రీం కోర్టులో ఏపీ మూడు రాజధానుల గురించి విచారణ..

supreme court to hear ap state capital issue

supreme court to hear ap state capital issue

AP Capital Issue : మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది.

2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరింది ఏపీ ప్రభుత్వం.

ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది.

కాలపరిమితితో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు.

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ది చేసి మూడు నెలల్లోపుగా భూ యజమానులకు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది.

అమరావతి రాజధానిపై మాత్రం స్టే ఇవ్వలేదు.

ఈ పిటిషన్ పై విచారణ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ లో వాయిదా వేసింది.

2014లో ఏపీలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు.

 

అయితే జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.

అమరావతిని శాసన రాజధానిగా , కర్నూల్ ను న్యాయ రాజధానిగా , విశాఖపట్టణాన్ని పాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని విపక్షాలు కోరతుున్నాయి.

అమరావతి రైతులు ఆందోళనలు నిర్వహించారు. పాదయాత్రలు చేశారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ, పలు పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

రాజధానిపై చట్టం చేసే అధికారం శాసభసభకు లేదని 2022 మార్చి మాసంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

త్వరలోనే విశాఖపట్నం రాజధాని కాబోతుందన్న ఏపీ సీఎం జగన్..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే విశాఖపట్నం రాజధాని కాబోతుందని జగన్ తెలిపారు.

అంతే కాకుండా తాను కూడా విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నట్టు వ్యాఖ్యానించారు.

కాగా, ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ఈ సందర్భంగా జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

ప్రపంచ పటంలో ఏపీని నిలబెట్టడానికి అందరీ సహకారాలు అవసరమన్నారు.

ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి.. జగన్ ధన్యవాదాలు తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్ గా ఉందని జగన్ తెలిపారు.

పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు.

ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో జగన్ పాల్గొన్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version