Supreme Court : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా జగన్ సర్కారు జీవో నెంబర్ వన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అలానే జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు కూడా భగ్గుమన్నాయి.
ఈ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైకాపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జీవో నంబర్-1పై హైకోర్టులో పిల్ దాఖలు కాగా.. సీపీఐ నేత రామకృష్ణ అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును కోరారు.
ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఏజీ శ్రీరామ్ ఈ పిల్‌ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని వాదనలు వినిపించారు.
ప్రస్తుతం ఉన్న చెంచ్‌కు పిల్‌పై విచారణ జరిపే అధికారం లేదన్నారు.
అయితే పిల్‌పై తాము అత్యవసరంగా విచారణ జరుపుతామని వెకేషన్ కోర్టు తెలిపింది. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు.
నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదని.. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులపై విచారణ జరపకూడదు అన్నారు.
అయితే ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆ జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది.
(Supreme Court) సుప్రీం కోర్టులో నేడు విచారణ..
దాంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఏపీ సర్కారు అభ్యర్థనపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం… ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిపేందుకు నిర్ణయించింది.
అటు, జీవో నెం.1పై ఏపీ హైకోర్టులో జనవరి 23న విచారణ జరగనుంది.
తెదేపా అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు పర్యటనల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో జగన్ సర్కారు ఈ జీవోని జారీ చేసింది.
కందుకూరు ఘటనలో 8 మంది మృతి చెందగా.. గుంటూరులో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ వరుస ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా అయిన విషయం తెలిసిందే.
ప్రతిపక్షాలకు మెరుగుతున్న మద్దతును చూడలేకే జగన్ సర్కారు ఈ జీవోని జారీ చేసిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
పవన్ యాత్రను అడ్డుకోవడానికి ఈ జీవో జారీ చేసిందని జనసేన నేతలంతా విమర్శించారు.
ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని.. బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని తీసుకొచ్చారని, అప్పుడు కూడా లేని నిబంధనలను ఇప్పుడు విధించారని నేతలు మండిపడుతున్నారు.
కాగా సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనున్న తరుణంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/