Site icon Prime9

Sukumar: “సుక్కు సుక్కు” సాంగ్ రిలీజ్ చేసిన దర్శకుడు సుకుమార్

sukumar releases sukku sukku song from dochevarevaruraa movie

sukumar releases sukku sukku song from dochevarevaruraa movie

Sukumar: తెలుగు చిత్ర పరిశ్రమ న్యూటాలెంట్స్ ను ఎంకరేజ్ చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. కొత్త నటీనటులకు ఛాన్స్ ఇచ్చి మంచి సినిమాలు తీస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నారు దర్శక నిర్మాతలు. కాగా ఇటీవల ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ముఖ్యపాత్రల్లో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బెనర్జీ అతిధి పాత్రలలో నటించిన చిత్రం “దోచేవారెవురా”. ఈ సినిమాను ఐక్యూ క్రియేషన్స్‌ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించగా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలోని ‘‘సుక్కు,సుక్కు ..’’ సాంగ్‌ను దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. సిరాశ్రీ సాహిత్యం అందించారు.

ఒకసారి దర్శకుడు అయిన తర్వాత ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూండాలి అనుకుంటారు. అందుకే శివనాగేశ్వరరావుగారు వన్స్‌మోర్‌ అని ఒక యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టారు. అందులో ఆయన అనుభవాలను ఒక్క అబద్దం కూడా లేకుండా చాలా సిన్సియర్‌గా మాట్లాడతారు. నేను విడుదల చేసిన ఈ సినిమాలోని రెండోపాటలో సుక్కు, సుక్కు అనే సౌండ్‌ నాకు బాగా నచ్చింది. నా పేరుతో వచ్చిన ఈ పాటలో 58ఏళ్ల అజయ్‌ఘోష్‌తో డాన్స్‌ చేయించాలి అనే ఆలోచన వచ్చిన శివ నాగేశ్వరావుగారికి హ్యాట్సాఫ్‌. అజయ్‌ఘోష్‌ చాలా మంచి ఆర్టిస్ట్‌ అని సుకుమార్ తెలిపారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అని చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:  గాడ్ ఫాదర్ బోరింగ్ సినిమా.. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ సంచల కామెంట్స్

Exit mobile version