Site icon Prime9

SSLV-D2 Launch: విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన బుల్లి రాకెట్ SSLV-D2

SSLV

SSLV

SSLV-D2 Launch: శ్రీహరికోట నుంచి చిన్న ఉపగ్రహ వాహననౌక SSLV-D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది.

శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రయోగంలో SSLV-D2.. 334 కిలోల బరువుండే మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.

తెల్లవారుజామున 2.48 గంటలకు మొదలైన కౌంట్ డౌన్ ప్రక్రియ..ఉదయం 9.18 గంటల వరకు కొనసాగింది.

6.30 గంటల పాటు సాగిన ఈ ప్రయోగంలో షార్ లోని మొదటి ప్రయోగ వేదిక SSLV-D2 నింగిలోకి బయలుదేరింది.

అనంతరం ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

 

ఇస్రో సరికొత్త రికార్డు..

ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్ 1, ఆజాదీ శాట్ 2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

గత ఏడాది SSLV-D1 పేరుతో నిర్వహించిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్ర్తవేత్తలు కృషి చేశారు.

ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంతో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

ఈ పరిణామం ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఆకర్షించనుంది.

 

(SSLV-D2 Launch) బుల్లి రాకెట్ వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

SSLV-D2 రాకెట్.. రెండు మీటర్ల వెడల్పు, 34 మీటర్ల పొడవు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. ఈ రాకెట్ ను నాలుగు దశల్లో ప్రయోగించున్నారు. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తి చేశారు.

రెండో దశ 7.7 టన్నుల ఇంధనంతో 384.4 సెకన్లలో, మూడో దశనను 4.5 టన్నల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేశారు. నాల్గవ దశలో మాత్రమే 0.05 టన్నలు ఇంధనంతో 785.1 సెకన్లలో పూర్తి చేశారు.

ఈ ప్రయోగంతో 156.3 కిలోల బరువు ఉండే భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌ 07, దేశీయ బాలికల ద్వారా స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ రూపొందించిన 8.7 కిలోల బరువు ఉండే ఆజాదీశాట్‌-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు ఉండే జానూస్‌-01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. అంతకు ముందు రాకెట్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Exit mobile version