Site icon Prime9

OG Movie: పవన్‌ కళ్యాణ్‌ ‘ఓజీ’తో అకిరా నందన్‌ ఎంట్రీపై తమన్‌ – మరో అప్‌డేట్‌తో బజ్‌ పెంచిన మ్యూజిక్‌ డైరెక్టర్‌

SS Thaman Crazy Update About Pawan Kalyan OG Movie: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలు మరోవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలు ఉన్నాయి. మొన్నటి వరకు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన ఈ మధ్యే సెట్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత డైరెక్టర్‌ సుజిత్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ'(OG) షూటింగ్‌లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు సుజిత్‌. ఇదిలా ఉంటే ఓజీలో పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకిరా నటిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఓజీ ఓ గ్యాంగ్‌స్టర్‌కి సంబంధించిన కథ, ఇందులో పవన్‌ టీనేజ్‌ రోల్లో అకిరా కనిపించడనున్నాడని టాక్‌. ఎప్పటి నుంచో అకిరా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇది పండగలాంటి అప్‌డేట్‌ అనిపించింది. ఇది విని పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంతా తెగ సంబరపడిపోతున్నారు. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అంతా డైలామాలో ఉన్నారు. నిజంగానే ఓజీ అకిరా నటిస్తున్నాడా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అకిరా ఎంట్రీపై మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ క్లారిటీ ఇచ్చారు. ఓజీ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ (నవంబర్‌ 16) తమన్‌ బర్త్‌డే సందర్భంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న తమన్‌ ఓజీ మూవీకి సంబంధించిన రెండు అప్‌డేట్స్‌ ఇచ్చాడు.

మొదట అకిరా డెబ్యూపై స్పందించాడు. అకిరా నందన్‌ ఓజీలో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది, నిజమేంత అని హోస్ట్ ప్రశ్నించారు. దీనికి తమన్‌ స్పందిస్తూ.. అకిరా సినిమాలోకి తీసుకురావడనికి ట్రై చేస్తున్నానన్నాడు. కానీ నటుడిగా మాత్రం కాదంటూ ట్విస్ట్‌ ఇచ్చాడు. ఇందులో పియానో ప్లేయర్‌గా అకిరాను తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. కాగా అకిరాకి నటుడిగా కంటే కూడా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావాలనేది కోరిక రేణు దేశాయ్‌ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అకిరాను ఓజీలో పియానో ప్లేయర్‌గా పరిచయం చేయాలని తమన్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

మరోవైపు ఓజీ రమణ గోకులతో కూడా ఓ పాట పాడించాలని అనుకుంటున్న అని చెప్పి ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెంచాడు. నిజానికి పవన్‌ కళ్యాణ్‌, రమణ గోకులది మ్యూజిక్ హిట్‌ కాంబో అనే విషయం తెలిసిందే. పవన్‌ సినిమాలో రమణ గోకుల పాడిన పాటలు మంచి హిట్‌ అయ్యాయి. అంతేకాదు మ్యూజిక్‌ పరంగా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. అయితే కొంతకాలంగా రమణ గోకుల సంగీతానికి దూరంగా ఉన్నారు. ఇటీవల వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఓ పాట పాడి రిఎంట్రీ ఇచ్చాడు. దీంతో రమణ గోకులతో ఓజీలో పాట పాడించాలని అనుకుంటున్నానని తమన్‌ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఓజీ తమన్‌ ఇచ్చిన ఈ రెండు అప్‌డేట్స్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ డబుల్‌ ట్రీట్‌ అనే చెప్పాలి.

Exit mobile version