Site icon Prime9

SS Karthikeya : “ఆర్ఆర్ఆర్” ఆస్కార్ క్యాంపైన్ కి ఎంత ఖర్చు అయ్యిందో చెప్పేసిన జక్కన్న కుమారుడు కార్తికేయ..

ss karthikeya comments about budget for rrr oscar campaign

ss karthikeya comments about budget for rrr oscar campaign

SS Karthikeya : “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్‌ అయిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా హాలీవుడ్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ అయితే భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. అంతేకాదు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ ని కూడా గెలుచుకొని భారత సినీ రంగంలో చరిత్ర సృష్టించింది.

కాగా ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేసారంటూ ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. తాజాగా దీని పై రాజమౌళి కొడుకు కార్తికేయ స్పందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ క్యాంపైన్ ఖర్చు గురించి మాట్లాడుతూ.. హాలీవుడ్ సినిమాలు క్యాంపైన్ కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మనకి అటువంటి అవకాశం లేదు. అందుకనే ఆస్కార్ క్యాంపైన్ కోసం మొదట 5 కోట్ల బడ్జెట్ అనుకున్నాము. ఆస్కార్ నామినేషన్స్ లో ఎంట్రీ ఇచ్చే సమయానికి 3 కోట్ల వరకు ఖర్చు అయ్యింది. నామినేట్ అయ్యాక బడ్జెట్ కొంచెం పెంచాం.

ఎలా పడితే అలా ఇచ్చేయడానికి అది మామూలు పురస్కారం కాదు..

దీంతో మొత్తం క్యాంపైన్ ఖర్చు 8.5 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపాడు. అలాగే ఆస్కార్ కొన్నారు అంటూ వస్తున్న వార్తల పై కూడా నోరు విప్పాడు. ఎలా పడితే అలా ఇచ్చేయడానికి అది మామూలు పురస్కారం కాదు. 95 ఏళ్ళ చరిత్ర ఉన్న పురస్కారం. అయినా అవార్డు కొనగలం గాని, ప్రేక్షకుల అభిమానం, స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జేమ్స్ కామెరాన్ మాటలు కొనలేము కదా? అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఆస్కార్ కి కేవలం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ మాత్రమే ఆహ్వానం అందింది. మిగిలిన వారంతా డబ్బులు పెట్టి ఆస్కార్ వేడుక టికెట్ కొనుకున్నారు అంటూ ఒక వార్త వైరల్ అయ్యింది. దీనిపై కూడా కార్తికేయ స్పందించాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ ఆహ్వానం పంపింది. రాజమౌళి మరియు ఇతర కుటుంబ సభ్యులు టికెట్ కొనుకొని ఆస్కార్ కి వెళ్ళాం. కుటుంబసభ్యులు, ఇతర సాంకేతిక నిపుణులు ఆస్కార్ కి హాజరుకావాలి అనుకుంటే, నామినేషన్స్ లో ఉన్నవారు మిగిలిన వాళ్ళ టికెట్స్ కోసం అకాడమీకి ఇమెయిల్ చేయాలి. అలా మా కోసం కీరవాణి, చంద్రబోస్ ఇమెయిల్ చేయగా, వాళ్ళు ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నాం. టికెట్స్ ధర విషయంలో మీరు విన్న వార్తలు కూడా నిజం కాదు. టికెట్స్ లో కూడా రకాలు ఉంటాయి. మేము లోయర్ లెవెల్ సీట్స్ కోసం ఒకొక టికెట్ కి 750 డాలర్లకి, టాప్ లో కూర్చొని చూసేందుకు మా కుటుంబంలోని నలుగురి కోసం ఒకొక టికెట్ కి 1500 డాలర్లు ఖర్చు చేసామని చెప్పాడు. ప్రస్తుతం చేసిన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

 

Exit mobile version