Site icon Prime9

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల.. అఫిషియల్ గా అనౌన్స్ చేసిన మేకర్స్

sri leela on board for pawan kalyan ustaad bhagat singh movie

sri leela on board for pawan kalyan ustaad bhagat singh movie

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు, సుజిత్ తో #OG, సాయి తేజ్ తో కలిసి చేస్తున్న వినోదాయ సిత్తం, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి. కాగా రాజకీయాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి పవన్ ఇప్పుడు ఈ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల సాయి తేజ్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 2024 ఎలక్షన్స్ లోపు ఈ చిత్రాలన్నీ ముగించేయాలని పవన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పవన్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ షూట్స్ లో బిజీగా ఉన్నాడు.

తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఆల్రెడీ గతంలోనే పూజాహెగ్డే ఒక హీరోయిన్ అని హరీష్ శంకర్ హింట్ ఇచ్చాడు.

 

 

అయితే మరో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుందనే వార్తలు కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించి అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఈ అమ్మడు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. కనీసం ఈ ముద్దుగుమ్మ చేతిలో పది సినిమాలైనా ఉన్నాయి. ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల బాలయ్య, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో చేస్తోంది. రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. అలానే నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకీ శ్రీలీల సంతకం చేసింది. కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త, కన్నడ మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల పవన్ సరసన ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం అందుతుంది.

Exit mobile version