Site icon Prime9

Rudi Koertzen Death: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో అంపైర్ రూడీ కోర్డెన్ కన్నుమూత

Rudi Koertzen Death: దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ అంపైరింగ్ దిగ్గజం రూడీ కోర్జెన్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో రూడీ ప్రాణాలు విడిచారు. రూడీ ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. నెల్సన్ మండేలా బే ఏరియాలో నివసించే రూడీ కోర్జెన్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కేప్ టౌన్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రివర్స్ డేల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రూడీ వయసు 73 సంవత్సరాలు. ఐసీసీ ఎలైట్ అంపైర్ గా ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లకు రూడీ కోర్జెన్ అంపైర్ గా వ్యవహరించాడు. వివాదరహితుడిగా గుర్తింపు పొందాడు. ఆటగాళ్లతో ఎంతో సౌమ్యంగా వ్యవహరించేవాడు. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కు రూడీ సన్నిహితుడు.

రూడీ కోర్జెన్ 1992 నుంచి 2010 వరకు అంపైర్ గా విధులు నిర్వర్తించాడు. 108 టెస్టులు, 209 వన్డేలు, 14 టీ20 అంతర్జాతీయ పోటీల్లో రూడీ అంపైరింగ్ చేశాడు. కాగా,రూడీ కోర్జెన్ మృతి పట్ల వీరేంద్ర సెహ్వాగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అతడి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని సెహ్వాగ్ వెల్లడించాడు. రూడీతో తనకు ఎంతో గొప్ప అనుబంధం ఉందన్నాడు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అడ్డదిడ్డంగా ఆడితే, కాస్త బుర్రపెట్టి ఆడు అంటూ సూచన చేసేవాడని, నీ బ్యాటింగ్ చూడాలనుకుంటున్నాను అని చెప్పేవాడని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు.

Exit mobile version