Tomato Curry: ప్రతీ ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య ఘర్షణలు సహజం. అరుదుగా మాత్రమే గొడవపడని అత్తాకోడళ్లును చూస్తాం. ఇక భార్యను.. తల్లిని బ్యాలెన్స్ చేయడం మగవాళ్లకి కానిపని. ఇక వారి మధ్య జరిగే గొడవలను ఆపడానికి కొడుకు మాత్రం నానా తంటాలు పడుతుంటాడు. అమ్మకు అండగా ఉంటే.. భార్యకు కోపం. భార్య వైపు మాట్లాడితే తల్లికి కోపం. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్లు తలలు పట్టుకుంటారు. కొందరు మాత్రం భార్య మాటలే విని తల్లిని అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. కొన్ని సందర్భాల్లో భార్య కోసం తల్లిపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు.
మహబూబాబాద్ జిల్లాలో ఓ కుమారుడు అలాంటి పనే చేశాడు. తన భార్య వండిన టమాట కూర బాగాలేదన్న తల్లిపై కత్తితో దాడి చేశాడు.
కుమారుడి దాడిలో తల్లి తీవ్రంగా గాయపడింది. మహబూబాబాద్ జిల్లా వేంనూరు గ్రామంలో మహేందర్, నందిని దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరితో పాటు మహేందర్ తల్లి కూడా ఉంటుంది. చిన్న చిన్న సందర్బాల్లో అత్తకు, కోడలికి గొడవ జరుగుతుండేది.
అలానే వీరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ.. ఒకరి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. కోడలు వండిన వంట బాగాలేదని అత్త అనడంతో వారి మధ్య గొడవ జరిగింది.
కూర సరిగ్గా వండటం రాదని అత్త మందలించడంతో కోడలు మనస్తాపం చెందింది. భర్త వచ్చాక కన్నీరు పెట్టుకోవడంతో మహేందర్ వివరాలు అడిగాడు.
అత్తపై ఫిర్యాదు చేసిన కోడలు.. మరో నాలుగు మాటలు నూరిపోసింది. నా భార్య వండిన కూరనే బాగలేదంటావా?.. అంటూ మహేందర్ కోపం వ్యక్తం చేశాడు.
అంతటితో ఆగక.. పక్కనే ఉన్న కత్తితో తల్లిపై దాడికి దిగాడు. ఈ దాడిలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/