Site icon Prime9

Anchor Rashmi : బయటకు వస్తే యాసిడ్ పోస్తాం.. చేతబడి చేయిస్తాం అంటూ… రష్మీపై విరుచుకుపడ్డ నెటిజన్

social-media-trollings-on-anchor-rashmi-about-dogs-issue

social-media-trollings-on-anchor-rashmi-about-dogs-issue

Anchor Rashmi : టాలీవుడ్ యాంకర్ రష్మీ.. శైలిలో రాణిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలానే మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన రష్మీ అందులో తన మాటలతో అందర్నీ ఫిదా చేసింది. ఇక జబర్దస్త్ లో వచ్చిన గుర్తింపుతో వెండి తెరపై కూడా మళ్ళీ వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం తాను ఎక్స్ట్రా జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఇతర షోలల్లో కూడా యాంకర్ గా చేస్తుంది రష్మీ.

ఇక రష్మీ – సుధీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. అయితే రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. రష్మీ గౌతమ్ మూగజీవులను ఎంత ప్రేమగా చూసుకుంటుందో తెలిసిందే. అందులో కుక్కలు అంటే బాగా ఇష్టపడుతుంది. ఇక దేశంలో ఎక్కడ మూగ జీవులపై దాడులు జరిగిన రష్మీ వెంటనే రియాక్ట్ అవుతుంది. తన సోషల్ మీడియా ఖాతాలో ఆ సంఘటనల గురించి తనదైన శైలీలో స్పందిస్తుంది. అయితే ఇప్పుడు ఆ కారణంగానే తీవ్ర విమర్శల పాలవుతుంది. ప్రస్తుతం ఆమె చుట్టు వివాదం రాజుకుంటోంది. కొంత మంది నెటిజన్లు దారుణంగా తిట్టిపోస్తున్నారు.  కొందరు అయితే డైరెక్ట్ గా బెదిరింపులకే దిగుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే (Anchor Rashmi)..?

అంబర్ పేట్ లో కుక్కల దాడిలో పసికందు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది సినీ..రాజకీయ ప్రముఖులు రకరకాలుగా స్పందించారు. ముఖ్యంగా మూగజీవాల అంటే ప్రాణం పెట్టే రష్మీ స్పందన  చాలా మందికి కోపం తెప్పించింది. కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధ కలిగించే విషయమే.. అయితే కుక్కలకు సెపరేట్ స్పేస్ ఇవ్వాలి.. వాటి పట్ల దయతో ఉండాలి అంటూ ఆమె మాట్లాడిన మాటలకు పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. మూగజీవాల తరపున మాట్లాడుతున్న రష్మీకి.. మానవత్వం ఎటు పోయిందంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.

ఇక కొంత మంది అయితే ఆమెపై కోపంతో ఊగిపోతున్నారు. నువ్వు బయట తిరగొద్దంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా ఓ నెటిజన్ ఆమెకు పెట్టిన మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నువ్వు ఇంట్లోనే ఉండు.. పాపిస్టిదానా.. బయటకు వస్తే యాసిడ్ పోస్తాం.. చేతబడి చేయిస్తాం అంటూ.. రష్మీపై విరుచుకుపడ్డాడు. బాబు మరణంపై కాస్త కూడా జాలి కలగలేదా అంటూ విమర్శిస్తున్నారు. అయితే రష్మీ తరపున కూడా కొంత మంది మాట్లాడుతున్నారు. వీధి కుక్కలకు ఫుడ్, షెల్టర్ ఉంటే ఇలాంటి సంఘటలను జరగవంటున్నారు. ఆకలితో ఉండి బయట తిరగడం వల్లే ఇలా జరుగుతుందంటున్నారు. ఇలా రష్మికి స్పోర్ట్ చేసే వారిని , జంతువులకు సపోర్ట్ గా మాట్లాడే వారిని కూడా చెప్పుతో కొట్టాలని.. మనుషుల ప్రాణాలు కంటే కుక్కలు ఎక్కువయ్యాయా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాలుగైదు రోజులుగా బాబు తరపున మాట్లాడుతూ.. సోకాల్డ్ మూగజీవాల ప్రేమికులకు గట్టిగ కౌంటర్ కూడా ఇస్తున్నారు. హైదరాబాద్ మేయర్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు పెడుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version