Site icon Prime9

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్డేట్.. “సీతా”నవమి గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్

adipurush movie

adipurush movie

Adipurush : ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. దీంతో ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తూ మూవీపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు (ఏప్రిల్ 29) సీతా నవమి కావడంతో కృతి సనన్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్ లో సీతగా కృతి సనన్ లుక్ అదిరిపోయింది. సీత పాత్రలో కృతి సనన్ ఒదిగిపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జానకి పాత్రలో కృతి సనన్ పోస్టర్  స్వచ్ఛత, దైవత్వం, ధైర్యం ఉట్టిపడేలా కనిపిస్తోంది.ఈ లుక్ కు తగ్గట్టు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా సెట్ అవ్వడంతో.. ఈ పోస్టర్ చూడగానే భక్తి భావం ఉట్టిపడి.. ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం సీత పాత్రలో కృతీసనన్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

కాగా రామాయణం ఆధారంగా ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ఇటీవల విడుదలైన టీజర్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై భారీగా ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీ తోపాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందించగా.. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ నుంచి ఓ బిట్‌ను లిరికల్ మోషన్ పోస్టర్‌గా రిలీజ్ చేశారు. ‘జై శ్రీరామ్’ అంటూ సాగే ఈ పాట వింటుంటే అందరికీ గూస్‌ బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ తో సంగీత దర్శకుడు అంచనాలను డబుల్ చేయగా.. రామ జోగయ్య శాస్త్రి మరోసాటి సాహిత్యంతో ఆకట్టుకున్నారు. ఇక ఈ లిరికల్ మోషన్ పోస్టర్‌లో ప్రభాస్ శ్రీరాముడిగా విల్లును ఎక్కుపెడుతూ కనిపించడం అభిమానులందరికీ హై ఫీస్ట్ ఇస్తుంది.

Exit mobile version