Site icon Prime9

Mrunal Thakur: సూసైడ్ చేసుకోవాలనుకున్న సీతారామం హీరోయిన్ మృణాల్

mrunal thakur

mrunal thakur

Mrunal Thakur: ఇటీవల విడుదలై ప్రజల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది సీతారామం మూవీ. ఈ చిత్రం ఎంత పెద్ద క్లాసిక్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించారు. ఈ అందమైన దృశ్యకావ్యానికి ప్రేక్షకలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సీతగా అలరించిన మృణాల్ ఠాకూర్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే తాను ఈ స్టేజిలోకి రావడానికి ఎన్నోకష్టాలు పడిందట. మొదట్లో అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట. మరి మృణాల్ అలా ఎందుకు అనుకుందో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.

రామాయణంలో సీతకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మన సీతారామం సీత కూడా అన్ని కష్టాలను ఎదుర్కొందట. ఇంతటి పేరు, స్థాయి సంపాధించడానికి ఎన్నో కష్టాలను అనుభవించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. మృణాల్ ఠాకూర్ స్వస్థలం ముంబై. తండ్రి వృత్తి రీత్యా బ్యాంక్ ఉద్యోగి అయిన నేపథ్యంలో ఆమె అనేక స్కూళ్లు మారవలసి వచ్చిందట. అయితే ఇంటర్లో మంచిగా మార్కులు సాధించడం వల్ల డెంటల్ డాక్టర్ అవుదామనుకుందట. కానీ అప్పట్లో విడుదలైన త్రీ ఇడియట్స్ సినిమా వల్ల తను సినిమాల్లో నటించాలని, బీఎంఎం కోర్సులో జాయిన్ అయిందట. దాని వల్ల తన తండ్రి ఇరుగుపొరుగు వాళ్ల నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.

కాగా ఆ తరుణంలోనే నాన్నకు ట్రాన్స్ ఫర్ అవ్వడంతో తాను ఒక్కతే చదువురీత్యా ముంబైలోనే ఉండాల్సి వచ్చిందని మృణాల్ తెలిపింది. కుటుంబానికి దూరంగా ఉన్న ఆ సమయంలో బాగా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని అని, చదువు బుర్రకు ఎక్కక లోకల్ ట్రైన్లో జర్నీ చేసేందుకు ఇబ్బంది పడుతూ ట్రైన్లో నుంచి దూకెయ్యాలనిపించేదని, ఆత్మహత్య చేసుకుందామని కూడా ప్రయత్నించానని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. ఆ తర్వాత బాలీవుడ్ భామ ప్రీతీజింతా ప్రేరణతో మోడలింగ్లోకి అడుగుపెట్టి ఆ సమయంలో ఓ సీరియల్లో నటించానని చెప్పింది. కాగా సినిమా ఛాన్స్ ల కోసం ఆడిషన్స్ వెళ్లిన ప్రతిసారి అక్కడ తనకు అవమానాలే ఎదురయ్యేవని, తనను అసలు నువ్ హీరోయిన్ గా ఎలా పనికొస్తావ్ సీరియళ్లలో నటించేవాళ్లు సినిమాలకు పనికి రారు అని సూటిపోటి మాటలు అనేవారని మృణాల్ ఠాకూర్ వివరించింది.

ఇదీ చదవండి: పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే రోజు రావాలి.. రాజకీయాలపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

Exit mobile version