Site icon Prime9

Visakha Boat Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనకు కారణం ఆ ఇద్దరేనా ??

shocking details revealed in Visakha Boat Fire Accident

shocking details revealed in Visakha Boat Fire Accident

Visakha Boat Fire Accident : ఈ నెల 19న ఏపీలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.  ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడిపోయాయి. ఈ అగ్నిప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే బోట్ల ప్రమాదంలో లోకల్ బాయ్ నాని ప్రమేయం లేదని కుటుంబసభ్యులు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. నిన్న కోర్టులో అతన్ని హాజరు పరచగా మీడియాతో కూడా ముచ్చటించారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు నాని.  తనకు ఈ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని.. కానీ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ వాపోయాడు. చేతులెత్తి దణ్ణంపెడుతున్నాను..నేను ఏ తప్పూ చేయలేదు దయచేసిన నమ్మండి అంటూ వేడుకున్నాడు. ఆరోజు ఏం జరిగిందో నాని ఇలా చెప్పుకొచ్చాడు..‘‘19 రాత్రి నేను వేరే ప్లేస్ లో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను. 9:46 నిమిషాలకు నాకు ఫోన్ వచ్చింది. దీంతో యాక్సిండెంట్ స్పాట్ కు వెళ్ళాను. ఇదంతా మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. నేను పార్టీలో డ్రింక్ చేసాను..డ్రింక్ చేయటం వల్ల నేను సేవ్ చెయ్యలేకపోయాను. ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమే నేను ప్రయత్నం చేశాను. కానీ, వీడియోలు తీస్తున్న నన్ను కొందరు కొట్టే ప్రయత్నం చేశారు. వీడియో తీసిన తర్వాత నేను కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నా. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాను.’ అని నాని వివరించాడు.

కాగా ఇప్పుడు తాజాగా ప్రమాదానికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఈ నెల 19న 10:48 గంటలకు హడావుడిగా ఇద్దరు వ్యక్తులు రావడం గుర్తించారు. ఆ తర్వాత 2 నిమిషాల వ్యవధి లోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అగ్ని ప్రమాద ప్రారంభ దశలో ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ ఇద్దరు ఎవరు.? ప్రమాదానికి ముందు హార్బర్ లో ఏం చేస్తున్నారు.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ ఘటనలో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఓ బోటులో ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని వారు చెప్పినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కాగా, 9 బోట్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

ఉప్పుచేపే ప్రమాదానికి కారణమా.?

ఫిషింగ్ హార్బర్ లోని బోటులో ఆ రోజు రాత్రి ఉప్పు చేప వేపుతుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది చేసింది యూట్యూబర్ నానికి బంధువే. అతనికి వరుసకు మామ అయ్యే వ్యక్తి మందులో మంచింగ్ కోసం ఉప్పు చేప వేపాడు. ఆ సమయంలోనే మంటలు చెలరేగాయి. కొద్ది రోజుల క్రితం అదే బోటులో అతను పని చేశాడు.’ అని 8 మంది అనుమానితులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

Exit mobile version