Pathaan Trailer: సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం “పఠాన్”. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్‌లో షారుఖ్ రాబోతుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి.
ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కాగా ఈ సినిమాలోని బేషరమ్ సాంగ్ వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ సాంగ్ లో బికినిలో అందాల ఆరబోతతో రెచ్చిపోయింది దీపికా. దాంతో పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అలాగే దీపికా కాషాయం రంగు బికినీ ధరించడంతో బీజీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. యాక్షన్.. యాక్షన్.. యాక్షన్.. ఫుల్ యాక్షన్ తో ట్రైలర్ ని నింపేశారు.
జాన్ అబ్రహం ఒక పోలీస్ కార్ మీద రాకెట్ లాంచ్ బాంబు షూట్ చేయడంతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఒక ప్రైవేట్ టెర్రర్ టీమ్ ఇండియా మీద భారీ ఎత్తున ఎటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇంటిలిజెన్స్ గ్రూప్ అజ్ఞాతవాసంలో ఉన్న గూఢచారి ‘పఠాన్’ (షారుఖ్ ఖాన్)ను రమ్మంటుంది. అ తర్వాత అతను వారిని ఎలా ఎదుర్కొన్నాడు. వారి ప్లాన్ ని ఎలా నాశనం చేశాడు అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హెలికాఫ్టర్ డ్రైవ్ చేస్తూ షారుఖ్ షూట్ చేసే విజువల్స్ హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 25న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ ట్రైలర్‌ను మూడు భాషల్లో విడుదల చేశారు. కాగా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేయడం విశేషం.
Wishing the whole team of #Pathaan all the very best!@iamsrk Sir looking fwd to seeing you in action sequences like never before! #PathaanTrailerhttps://t.co/63G1CC4R20 @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/MTQBfYUfjg
— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2023
ఇవి కూడా చదవండి:
CS Somesh Kumar: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాలి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో మొసళ్లు.. ప్రజల్ని హెచ్చరించిన అధికారులు
Minister Ktr : అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాం : కేటీఆర్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/