Site icon Prime9

SEHWAG: దిల్లీ ఓటమికి వారిదే బాధ్యత.. వీరేంద్ర సెహ్వాగ్‌ కీలక వ్యాఖ్యలు

sehwag

sehwag

SEHWAG: దిల్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. గెలిచే అవకాశాలు ఉన్న.. ఆ జట్టు గెలవలేకపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. దిల్లీ ఓటమికి బాధ్యత వారిదేనని కీలక వ్యాఖ్యలు చేశాడు.

కీలక వ్యాఖ్యలు.. (SEHWAG)

దిల్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. గెలిచే అవకాశాలు ఉన్న.. ఆ జట్టు గెలవలేకపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. దిల్లీ ఓటమికి బాధ్యత వారిదేనని కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందంటే.. అది దిల్లీ మాత్రమే. ఇప్పటివరకు ఆ జట్టు ఐదు ఓటములను చవిచూసింది. తాజాగా ఆ జట్టు వరుస ఓటములపై సెహ్వాగ్ స్పందించాడు. తాజాగా జరిగిన బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించే అవకాశం ఉన్న.. ఓటమి పాలైంది. బెంగళూరును 174/6 స్కోరుకే పరిమితం చేసినప్పటికీ.. టాప్‌ ఆర్డర్‌ విఫలంకావడంతో దిల్లీ 151 పరుగులకే పరిమితమైంది.

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ, ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్‌ ఉన్నా దిల్లీకి మాత్రం పరాభవాలు తప్పడం లేదు.

వీరిద్దరూ దిల్లీ ఓటమికి బాధ్యత తీసుకోవాలని భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు.

జట్టు విజయంలో ప్రధాన పాత్ర కోచ్ లదే. కాబట్టి దిల్లీ వరుస ఐదు ఓటములకు రికీ పాంటింగ్, గంగూలీ తీసుకోవాలని తెలిపాడు.

గత సీజన్‌ వరకూ రికీ పాంటింగ్‌ అద్భుతంగా బాధ్యతలను నిర్వర్తించాడు. దిల్లీని ఫైనల్స్‌కు చేర్చాడు.

దాదాపు ప్రతి సంవత్సరం ప్లేఆఫ్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇలాంటి క్రెడిట్‌ అతడి ఖాతాలో పడినప్పుడు, ఇప్పుడు ఓటమికి కూడా బాధ్యత తీసుకోవాలి. ఇదేమీ భారత క్రికెట్‌ జట్టు కాదు.

ఎందుకంటే అక్కడ ఎవరైనా గెలిస్తే తమ గొప్పగా భావిస్తారు. ఓడితే మాత్రం ఇతరులను నిందిస్తారు. ఏది ఏమైనా సరే ఐపీఎల్‌లో కోచ్‌ పాత్ర ఏమీ ఉండదు.

శూన్యమనే చెప్పాలి. వారి పాత్ర కేవలం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం మాత్రమే. అయితే, తమ జట్టు గెలిస్తే కోచ్‌ ఆనందంగా ఉంటారు.

ఈసారి దిల్లీ టీమ్‌ మాత్రం గొప్పగా రాణించలేదు. రాబోయే మ్యాచుల్లో దిల్లీ గెలిచి తమ రాతను మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని సెహ్వాగ్‌ చెప్పాడు.

Exit mobile version