Site icon Prime9

Secunderabad: రైలు ప్రయాణికులకు అలెర్ట్.. క్యాన్సిల్ అయిన 17 రైళ్లు

Secunderabad

Secunderabad

Secunderabad: సికింద్రాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 20,21 వ తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆయా రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. సికింద్రాబాద్ డివిజన్ లోని ఘట్ కేసర్, చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆర్ యూబీ పనుల దృష్ట్యా పలు రైళ్లు రద్దు తో పాటు ఇంకొన్ని రీ షెడ్యూల్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

 

రద్దు అయిన రైళ్ల వివరాలు(Secunderabad)

ఈ నెల 21, ఆదివారం .. 17 రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.

వరంగల్ టూ సికింద్రాబాద్‌ ( ట్రైన్ నెంబర్‌ 07757 ) సికింద్రాబాద్‌ టూ వరంగల్‌ (07462)

వరంగల్‌ టూ హైదరాబాద్‌ (07463), హైదరాబాద్‌ టూ కాజీపేట (07758),

కాచిగూడ నుంచి మిర్యాలగూడ (07276), మిర్యాలగూడ నుంచి నడికుడి (07277),

నడికుడి నుంచి మిర్యాలగూడ (07973), మిర్యాలగూడ నుంచి కాచిగూడ (07974),

సికింద్రాబాద్‌ నుంచి రేపల్లె (17645), గుంటూరు టూ వికారాబాద్‌(12747),

వికారాబాద్‌ టూ గుంటూరు(12748), హైదరాబాద్‌ టూ సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17011),

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ (17012), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ టూ సికింద్రాబాద్‌ (17234),

సికింద్రాబాద్‌ టూ గుంటూరు (17202), గుంటూరు టూ సికింద్రాబాద్‌ (17201), సికింద్రాబాద్‌ టూ సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233)

 

ఆలస్యంగా నడవనున్న రైళ్లు

ఈ నెల 20, శనివారం పలు ప్రధాన రైళ్లు గంట నుంచి 3 గంటల పాటు ఆలస్యంగా నడవనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

హావ్‌డా టూ సికింద్రాబాద్‌( రైలు నెంబర్‌ 12703) మూడు గంటల పాటు ఆలస్యంగా బయలు దేరుతుంది. శనివారం ఉదయం 8.35 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలును ఉదయం 11.35 గంటలకు రీ షెడ్యూల్‌ చేశారు.

భువనేశ్వర్‌ టూ ముంబై సీఎస్‌ఎంటీ (11020) రైలు కూడా 3 గంటల ఆలస్యంగా నడవనుంది. సాధారణంగా మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 6.20 గంటలకు రీ షెడ్యూల్ చేశారు.

త్రివేండ్రం నుంచి సికింద్రాబాద్‌ (17229) రైలు 2 గంటలు ఆలస్యంగా నడవనుంది. ఉదయం 6.45 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్ శనివారం ఉదయం 8.45 గంటలకు బయల్దేరుతుంది.

రాత్రి 11.20 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం టూ ముంబై ఎల్‌టీటీ (18519) రైలు1 గంట ఆలస్యంగా అర్ధరాత్రి 12.20 నిమిషాలకు బయల్దేరుతుంది.

మే 21 ,ఆదివారం సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్ టూ మన్మాడ్‌ (17064) రైలు 3 గంటలు ఆలస్యంగా రాత్రి 9.50 గంటలకు మొదలు కానుంది

 

Exit mobile version