Vande Barat Express: సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ ట్రైన్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ

వందే భారత్ రైలును వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు.

  • Written By:
  • Updated On - January 15, 2023 / 12:29 PM IST

Vande Barat Express: వందే భారత్ రైలును వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు.

తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఈ రైలు ద్వారా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాన్ని అనుసంధానిస్తూ ప్రయాణం కొనసాగింవచ్చని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని వందే భారత్ రైలు తగ్గిస్తుందని చెప్పారు. ఈ ఆధునాతన రైళ్లను పూర్తిగా దేశీయంగా తయారు చేశామని, వీటితో బహుళ ప్రయోజనాలు ఉంటాయని అన్నారు.

అత్యంత వేగంతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయొచ్చని తెలిపారు.

ఈ మేరకు వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. ఇవాళ ఒక్కరోజు 21 స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.

రేపటి (సోమవారం) నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖ స్టేషన్లలో మాత్రమే ట్రైన్ ఆగనుంది.

ఈ సందర్భంగా సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కారణాల రీత్యా హాజరుకాలేకపోయారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించిన ఛార్జీల వివరాలు వెల్లడయ్యాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఛార్జీల వివరాలను పొందుపర్చారు.

ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల వారీగా ఛార్జీల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో తెచ్చారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగే వివిధ ప్రాంతాల మధ్య ఛార్జీల వివరాలను కూడా ప్రకటించారు.

ఛార్జిల వివరాలు ఇలా..

విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఛైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.1720, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.3170గా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వెల్లడించారు.

సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఛైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.905, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.1775గా ఉండగా..

రాజమండ్రికి ఛైర్ కార్ ధర రూ.1365,  ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2485గా ఉంది. క్యాటరింగ్, రిజర్వేషన్, జీఎస్టీ, సూపర్ ఫాస్ట్ ఛార్జీలన్నీ కలిపి ఈ టికెట్ ధరలను నిర్ణయించారు.

ఇప్పటికే దేశంలోని పలు మార్గాల్లోనూ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. భారత్ లో దాదాపు 400 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో నిధులు కేటాయించింది.

ఈ రైళ్లను మూడేళ్లలో తయారు చేస్తారు. ఈ రైళ్లు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో వీటిని రూపొందిస్తున్నారు.

గత బడ్జెట్ లో రైల్వే శాఖకు రూ.1,40,367.13 కోట్ల నిధులు కేటాయించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు.

సంక్రాంతి సందర్భంగా ఇవాళ వందే భారత్ రైలును ప్రారంభిస్తుండడం సంతోషకరమని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ ను రూ.699 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.

కాగా, రేపటి నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు సేవలు అందుతాయని వెల్లడించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/