Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌లోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అధికారులు ఓ అస్థి పంజరాన్ని గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు.. ముగ్గురు భవనంలో చిక్కుకుపోయారు. అయితే ఆ ముగ్గురిలో ఈ అస్థి పంజరం ఎవరిదో తెలియాల్సి ఉంది.
నల్లగుట్టలో జరిగిన ఈ ప్రమాదంలో అధికారులు ఇప్పటివరకు ఒక మృతదేహన్ని గుర్తించారు.
ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది కనిపించకుండపోయారు. తమ వస్తువులు తెచ్చుకునేందుకు ముగ్గురు వెళ్లారని సహచరులు తెలిపారు.
తాజాగా మొదటి అంతస్తులో శిథిలాల వెనక అస్థిపంజరాన్ని అగ్నిమాపక అధికారులు గుర్తించారు.
అయితే కనిపించకుండపోయిన ముగ్గురిలో ఇది ఎవరి అస్థిపంజరమో తెలియాల్సి ఉంది.
ఈ అగ్ని ప్రమాదంలో Secunderabad Fire Accident పొగలు ఇంకా వ్యాపించి ఉన్నాయి.
ఇప్పటికి భవనంలో పొగలు వెలువడుతున్నట్లు తెలుస్తుంది.
భవనంలోకి వెళ్లేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
కానీ లోపని నుంచి ఇప్పటికి పొగలు వస్తుండడంతో దానిని నియంత్రించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తోంది.
ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
పొగను పూర్తిగా నియంత్రించేందుకు ఫోమ్ చల్లుతున్నారు.
మరోవైపు ఈ భవనాన్ని అధునాతన స్కానర్లతో క్లూస్ టీం పరిశీలిస్తుంది.
లోపలికి వెళితే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని.. అధికారులు అంటున్నారు.
స్థానికులతో మంత్రి తలసాని మాట్లాడారు. ప్రమాదం జరిగిన కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేస్తామని మంత్రి తెలిపారు.
ఈ ప్రమాదంలో పూర్తిగా భవనం దెబ్బతిన్నదని అధికారులు గుర్తించారు.
ముందు జాగ్రత్తలు తీసుకొనే భవనాన్ని కూల్చివేస్తామని మంత్రి స్థానికులకు హామీ ఇచ్చారు.
పరిస్థితులు మెరుగయ్యేంతవరకు స్థానికులు ఇటువైపు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
ప్రమాద సమయంలో దట్టమైన పొగ వ్యాపించడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇలాంటి ప్రమాదాలు మరలా జరగకుండా.. చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని అన్నారు.
బాధితులకు అండగా ఉంటామని.. ఎవరు అదైర్యపడొద్దని మంత్రి అన్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/